Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
లాస్ ఏంజెలెస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భానుమితి... అమ్మడి సినిమాకు ప్రశంసల వెల్లువ
భానుమతి రామకృష్ణ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ సలోనీ ఇండిపెంటెంట్ అమ్మాయి రోల్స్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఓ వైపు దక్షిణాదిన వరుస సినిమాలతో బిజీగా మారుతున్న సలోనీ, మరోవైపు అంతర్జాతీయ స్థాయిలోనూ రప్ఫాడించేస్తోంది.
మొదటి సినిమాతోనే నటనా పరంగా వందకు వంద మార్కులు వేయించుకున్న సలోనీ రెండు అమెరికన్ సినిమాల్లోనూ నటించింది. టర్న్డ్ అవుట్, ఫర్బిడ్డెన్ సినిమాల్లో రెండు విభిన్నమైన పాత్రలు పోషించింది. ఇందులో ఫర్బిడ్డెన్ అనే షార్ట్ ఫిల్మ్ లాస్ ఏంజెలెస్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపిక అవ్వడం మరో విశేషం.
భానుమతి రామకృష్ణ సినిమాలో కాస్త తలబిరుసు అమ్మాయిగా కనిపించి మెప్పించిన సలోనీ, ఫర్బిడ్డెన్ లో సంప్రదయానికి కట్టుబడే తండ్రి చాటు తనయగా కనిపించింది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటోన్న పరువు హత్యలు, మతం ముసుగులో అమ్మాయిలపై జరుగుతున్న దౌర్జన్యకాండను ఈ సినిమా కళ్లకు కడుతుంది. ఓ నిజ జీవిత గాథ ఆధారంగా ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది.
లాస్ ఏంజెలెస్ లోని FFTG ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫర్బిడ్డెన్ మూవీని స్క్రీన్ చేయనున్నారు. మరోవైపు తెలుగులోనూ పలు సినిమాలకు సంతకాలు చేసిన సలోనీ ఇక్కడి ప్రేక్షకులను మరింత గా అలరించేందుకు సిద్ధమవుతోంది.