కోడి రామకృష్ణ దేవతలులో భానుప్రియ
ఒకప్పుడు సూపర్‌హిట్ చిత్రాలు అందించిన కోడి రామకృష్ణ చాలాకాలం తర్వాత దేవత అనే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో ఎ ఫిల్మ్ బై అరవింద్ ఫేం రుషి, జూనియర్ రాధిక జంటగా నటించనున్నారు. తాను తీసిన కొన్ని సినిమాలు సరిగా ఆడలేదని, దేవతలు మాత్రం కొత్త కథా కథనంతో ప్రేక్షకులను అలరించనుందని కోడి చెబుతున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్‌ఫిలింస్ బ్యానర్‌పై జి.శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ నటి భానుప్రియ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఘంటాడి కృష్ణ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమాలో అన్నపూర్ణ, సత్యప్రకాష్, అపూర్వ, నాగమణి, విజయరంగరాజు ఇతర తారాగణం.


Click it and Unblock the Notifications