అలా చెప్పుకునేందుకు సిగ్గు పడాల్సిన పరిస్థితి.. ఏపీ గవర్నమెంట్ తీరుపై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీ గవర్నమెంట్, వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు సమర్దిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ అంశం జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ తరుణంలో ఇదే మూడు రాజధానుల అంశంపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. వివరాల్లోకి పోతే.
Recommended Video


రాజధాని అంశంపై ఫోకస్.. అనూహ్యంగా వైసీపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు నగరాలను రాజధానులుగా మార్చనున్నట్టు వై.ఎస్.జగన్ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమరావతి నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు చేశారు కూడా. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న వైసీపీ ప్రభుత్వం.. అనూహ్యంగా రాజధాని అంశంపై ఫోకస్ పెట్టింది.

సీఎం జగన్ నిర్ణయం.. సినీ పరిశ్రమ మద్దతు
ఏపీకి మూడు రాజధానులు ఉండాలని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సినీ పరిశ్రమ నుంచి కూడా మద్దతు లభించింది. మెగాస్టార్ చిరంజీవి నేరుగా సీఎం జగన్‌ను కలిసి తన మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.

తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్.. వ్యంగ్యంగా!
ఇదిలా ఉండగా తాజాగా అదే తెలుగు చిత్రసీమకు చెందిన సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మూడు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండంటూ వ్యంగ్యంగా మాట్లాడటం హాట్ హాట్ చర్చలకు తావిచ్చింది.

7 వేల కోట్లు పెట్టేశారు.. ఇంకా 3 వేల కోట్లు పెడితే..
ఓ వైపు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజాసంఘాలు, విపక్షాలు, రైతులు పోరాటాలు చేస్తుండగా తాజాగా నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అంతా షాక్ అయ్యారు. అమరావతి నిర్మాణానికి 7 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇంకో 3 వేల కోట్లు ఖర్చు చేస్తే అమరావతిలో నిర్మిస్తున్న కట్టడాలన్నీ పూర్తవుతాయి అని అన్నారు తమ్మారెడ్డి.

చెప్పుకునేందుకు సిగ్గు పడాల్సిన పరిస్థితి
ప్రభుత్వాలు మారినా ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న తమ్మారెడ్డి.. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు బూతులు తిట్టుకోవడం సిగ్గుచేటని అన్నారు. వాళ్ళ భాష చూస్తుంటే తెలుగు వాడని చెప్పుకునేందుకు సిగ్గు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు. మొత్తంగా రాజధాని విషయంలో ప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు.


Click it and Unblock the Notifications











