twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మాయిలు రాత్రి పూట సినిమా ఆఫీస్‌లకు ఎందుకు వెళ్లాల్సి వస్తోంది.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్

    |

    సినిమాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేస్తున్నారంటూ గతంలో శ్రీ రెడ్డి చేసిన హంగామా నేటికీ కొనసాగుతోంది. తమకు సినిమాల్లో వేషాలు ఇవ్వడం లేదంటూ ఈ మధ్యకాలంలో చాలా మంది అమ్మాయిలు యూ ట్యూబ్ వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. వివరాల్లోకి పోతే..

    అమ్మాయిల విషయంలో అది నిజమే

    అమ్మాయిల విషయంలో అది నిజమే

    తన సొంత యూట్యూబ్‌ ఛానెల్ లో వీడియో పోస్ట్ చేసిన తమ్మారెడ్డి.. ప్రస్తుతం అమ్మాయిలకు న్యాయం జరగడం లేదనేది నిజమే అన్నారు. ప్రభుత్వం అలాంటి వాటిని అరికట్టడానికి ఎన్నో చట్టాలు తీసుకొస్తూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరైన న్యాయం జరగడం లేదన్నది వాస్తవం అని ఆయన పేర్కొన్నారు.

    మాకు వేషాలు ఇవ్వడం లేదంటూ కొంతమంది అమ్మాయిలు

    మాకు వేషాలు ఇవ్వడం లేదంటూ కొంతమంది అమ్మాయిలు

    ఇదే విషయమై లోతుగా మాట్లాడిన తమ్మారెడ్డి.. ''ఈ మధ్య కొన్ని ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కొన్ని చూశాను. అదేవిధంగా యూట్యూబ్‌లో కూడా మాకు వేషాలు ఇవ్వడం లేదంటూ కొంతమంది అమ్మాయిలు క్యాస్టింగ్ కౌచ్ బాధలు చెప్పుకోవడం కూడా చూశాను. వీళ్లకు న్యాయం జరగడం లేదనేది నిజమే. అయితే ప్రభుత్వం ఆడవాళ్ళ మీద తెచ్చిన చట్టాలు కొంతవరకు హెల్ప్ చేస్తాయి'' అని అన్నారు.

    రాత్రి పూట సినిమా ఆఫీస్‌లకు వెళ్లాల్సిన పని ఏంటి?

    రాత్రి పూట సినిమా ఆఫీస్‌లకు వెళ్లాల్సిన పని ఏంటి?

    ఈ విషయం చెబుతూ ఆడవాళ్లపై కూడా సంచలన కామెంట్స్ చేశారు తమ్మారెడ్డి. కొంత మంది మాకు వేషం ఇవ్వడం లేదంటారు. ఇంకొంతమంది ఆఫీస్‌కి రానివ్వడం లేదంటారు. మరి.. క్యాస్టింగ్ కాల్ లేకుండా అసలు ఆఫీస్‌లకు వాళ్లు ఎందుకు వెళ్తున్నారు? రాత్రి పూట సినిమా ఆఫీస్‌లకు వెళ్లాల్సిన పని ఏంటి? ఈ విషయం అడిగితే మాకు అలవాటు అయిపోయింది.. మేం ఎప్పుడైనా ఆఫీస్‌లకు వెళ్లి వేషం అడుగుతాం. వాళ్లు ఆ టైమ్ లో వెళ్తే వేషం ఇస్తారు. అందుకనే వెళ్తున్నాం అంటున్నారు అని చెప్పారు.

    అది కరెక్ట్ కాదు.. పిలవకుండా వెళ్లి

    అది కరెక్ట్ కాదు.. పిలవకుండా వెళ్లి

    అది కరెక్ట్ కాదు కదా.. అసలు వాళ్లు పిలవకుండా ఆఫీస్‌లకు వెళ్లకూడదు. వాళ్లు వేషాలు ఇస్తారనే నమ్మకం లేనప్పుడు వెళ్లకూడదు. వాళ్ళు సినిమాలు తీస్తారా.. తీయరా అని తెలియని వారి దగ్గరికి వెళ్లడం తప్పు. తెలిసిన కంపెనీలు అయితే వెళ్లి అడిగినా పర్లేదు కాని.. పగలు వెళ్తే ఓకే. రాత్రిపూట వెళ్లడం, వేషం ఇవ్వలేదని ఆరోపించడం కామన్‌గా మారింది. వేషం అడగడానికి మీకు హక్కు ఉంది కాని.. వేషం ఎందుకు ఇవ్వరనడానికి మీకు హక్కు లేదు అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.

    వాళ్లు ఆఫీస్ పెట్టుకుంది అందుకోసమే..

    వాళ్లు ఆఫీస్ పెట్టుకుంది అందుకోసమే..

    క్యాస్టింగ్ కౌచ్ పేరుతో అమ్మాయిలకు వేషాలు ఇస్తానని వాళ్లను ఆఫీస్‌లకు రప్పించుకుని వాడుకోవడం తప్పు. అటువంటి వాళ్లను శిక్షించాల్సిందే. కానీ.. వాళ్ళు సినిమా తీసుతున్నారు కాబట్టి నాకు వేషం ఇవ్వాలనే హక్కు ఏ ఒక్కరికీ లేదు. సినిమా తీసేవాడి ఇష్ట ప్రకారం ఏ పాత్రకు ఎవరు సరిపోతారో చూసుకుంటారు. వాళ్లు ఆఫీస్ పెట్టుకుంది తీసి నాలుగు డబ్బులు సంపాదించుకోవడం కోసం తప్ప నీకు వేషం ఇవ్వడానికి కాదు అని అన్నారు తమ్మారెడ్డి.

    ఇద్దరికీ నచ్చితేనే..

    నాకు వేషం ఇవ్వడం లేదని యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం సరైన పద్ధతి కాదు. వాళ్ళు ఏ ఆధారాలతో పెడుతున్నారో, ఏ ఆలోచనతో పెడుతున్నారో నాకు తెలియదు కానీ.. వేషం ఇవ్వడంలో ఏ పాత్రకు ఎవ్వరిని తీసుకోవాలో పూర్తి హక్కు నిర్మాతకు, దర్శకుడికి ఉంటుంది. బలవంతంగా సినిమాల్లోకి దూరలేం. వేషం అనేది కూడా ఉద్యోగం లాంటిదే. అది ఇచ్చే వాడికి, తీసుకునే వాడికి నచ్చాలి అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.

    ఆమె చెప్పడం చాలా కష్టం.. నా ఆలోచన అదే

    ఆమె చెప్పడం చాలా కష్టం.. నా ఆలోచన అదే

    ఈ మధ్యకాలంలో క్యాస్టింగ్ కౌచ్‌పై వెబ్ సిరీస్ చూస్తే.. అందులో ఒక అమ్మాయి అత్యాచారం జరిగింది. దాన్ని విచారిస్తూ.. ఆ హత్యాచారం ఎలా జరిగింది? లాంటి వివరాలు పోలీసులు అడిగితే.. ఆమె చెప్పడం చాలా కష్టం. అప్పటికే బాధలో ఉన్న ఆమెను ఇంకా టార్చర్ చేయడం ఎంత వరకు న్యాయం. చట్టాలు మారడం కాదు.. మన ఆలోచన విధానం కూడా మారాలి. ఇప్పటికే చాలా వరకూ మారింది అంటున్నారు పెద్దగా మార్పు రాలేదు. ఈ మార్పు రావాలనేదే నా ఆలోచన అంటూ ముగించారు తమ్మారెడ్డి.

    English summary
    Director Bharadwaja Thammareddy released a new video on the issue of Costing Couch. He Commented some persons.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X