మహేష్ బాబు, అల్లు అర్జున్‌లపై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్.. జగన్‌, చంద్రబాబునూ వదల్లేదు!

సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ షాకింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు. ఈ వీడియోలో స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్‌లపై ఓ రేంజ్ కామెంట్స్ చేయడమే గాకా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబులనూ వదల్లేదు తమ్మారెడ్డి. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. మరి ఈ సీనియర్ నిర్మాత చేసిన కామెంట్స్ ఏంటి? వివరాల్లోకి పోతే..

మహేష్ బాబు, అల్లు అర్జున్ వార్.. ఒక్క రోజు గ్యాప్‌లో

మహేష్ బాబు, అల్లు అర్జున్ వార్.. ఒక్క రోజు గ్యాప్‌లో

ఎప్పటిలాగే 2020 సంక్రాంతి కూడా ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ సారి బాక్సాఫీస్ వార్‌లో యంగ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ తలపడ్డారు. సంక్రాంతి సమరానికి సై అంటూ కేవలం ఒక్క రోజు గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ దుమ్ము దులిపారు.

సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురములో

సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురములో

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ జనవరి 11న విడుదలై 100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇక ఆ వెంటనే వచ్చిన 'అల.. వైకుంఠపురములో' మూవీ అదే రేంజ్ వసూళ్లు రాబట్టి రికార్డులు తిరగరాసింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సత్తా చాటింది.

సంక్రాంతి విన్నర్.. తల పట్టుకుంటున్న ఆడియన్స్

సంక్రాంతి విన్నర్.. తల పట్టుకుంటున్న ఆడియన్స్

ఈ రెండు సినిమాలు ఎంత పోటీ పడ్డాయో అంతగా వసూళ్లు కొల్లగొట్టడంతో.. సినిమా కలెక్షన్స్‌లో తమ సినిమా అంటే తమ సినిమా టాప్ అని ఇరు చిత్రాల దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఒకరు సంక్రాంతి విన్నర్ అంటే.. మరొకరు ఇండస్ట్రీ హిట్ అంటూ ఓ రేంజ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఎవరు టాప్ అనేది తెలియక తల పట్టుకుంటున్నారు ఆడియన్స్.

మహేష్ బాబు, అల్లు అర్జున్ ఫైట్.. ఎంటరైన తమ్మారెడ్డి

మహేష్ బాబు, అల్లు అర్జున్ ఫైట్.. ఎంటరైన తమ్మారెడ్డి

ఈ నేపథ్యంలో తాజాగా ఈ పోస్టర్స్, రెండు సినిమాల విజయాలపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. మహేష్ బాబు, అల్లు అర్జున్ బొమ్మలను చేతబట్టి మా హీరో గ్రేట్ అంటే.. మా హీరోగ్రేట్ అంటూ ఆ ఇద్దరి దర్శకనిర్మాతలు కొట్టుకుంటున్నట్లుగా చెబుతూ వీడియో పోస్ట్ చేశారు. అంతేకాదు బాహుబలి తర్వాతేగా మీ ఇద్దరూ.. బాహుబలి దాటితే అప్పుడు మాట్లాడండి అని అన్నారు.

ఎందుకురా కొట్టుకుంటారు.. మీకేం పోయే కాలం

ఎందుకురా కొట్టుకుంటారు.. మీకేం పోయే కాలం

రెండు సినిమాలు హిట్టే కదా!.. ఎందుకురా కొట్టుకుంటారు. రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉండాలి కానీ.. ఇలా మీకేం పోయే కాలం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు తమ్మారెడ్డి.

సీఎం, మాజీ సీఎంలనూ వదలని నిర్మాత

అంతటితో ఆగని తమ్మారెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం, మాజీ సీఎంలనూ వదల్లేదు. జగన్‌, చంద్రబాబుల బొమ్మలు కూడా పట్టుకొని.. ఇద్దరూ ఒకరి అవినీతిని మరొకరు స్వయంగా చెప్పుకుంటున్నట్లుగా చిన్న వివరణ ఇచ్చారు తమ్మారెడ్డి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X