Oscars 2023 కోసం RRR టీమ్ 80 కోట్ల ఖర్చు.. తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్!
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టత్మకంగా తెరపైకి తీసుకువచ్చే RRR సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా ఆస్కార్ వేదికపై RRR సినిమా ప్రస్తావన వస్తూ ఉండడంతో ఇప్పుడు ఆ మూమెంట్ కోసం చాలామంది సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఆస్కార్ కోసం భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నారన్న విషయం గురించి కొందరు విభిన్నమైన తరహాలో కామెంట్ చేస్తున్నారు. ఇక తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఆ విషయంలో ఊహించని విధంగా స్పందించారు.

అందరి ఫోకస్ RRR పైనే..
రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ RRR బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ద్వారా దర్శకధీరుడు రాజమౌళి తన స్థాయిని మరో లెవెల్ కు పెంచుకున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు ఆస్కార్ లో కూడా ఈ సినిమా పోటీగా నిలవడంతో అందరి ఫోకస్ ఈ సినిమా పైన పడింది.

నామినేట్ కావడంతో..
సినిమాలోని అద్భుతమైన పాట నాటు నాటు ఏకంగా ఆస్కార్ కు నామినేట్ కావడంతో ఇప్పుడు ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. తప్పకుండా అవార్డు రావాలి అని చాలామంది తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండియన్స్ సినిమా లవర్స్ కూడా కోరుకుంటున్నారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు ఇలాంటి గౌరవం దక్కలేదు. కాబట్టి RRR సినిమా తప్పకుండా ఆస్కార్ అవార్డును అందుకోవాలని కోరుకుంటున్నారు.

మిస్ చేసుకోవద్దు అని
అయితే ఈ అవకాశాన్ని ఏ మాత్రం మిస్ చేసుకోవద్దు అని రాజమౌళి టీమ్ మొదటి నుంచి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇండియన్ సినిమా ఫోకస్ అయ్యేలా ప్రయత్నం చేశారు. గోల్డెన్ గ్లొబ్ అవార్డ్స్ లో కూడా నాటు నాటు పాట అవార్డులను దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ అవార్డుల వేడుకల్లోనే రాజమౌళి ప్రత్యేకంగా హాలీవుడ్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.

80 కోట్ల వరకు ఖర్చు
అయితే ఆస్కార్ అవార్డ్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అవార్డ్స్ ప్రమోషన్స్ లో భాగంగా RRR టీ. దాదాపు ఇప్పటివరకు 80 కోట్ల వరకు ఖర్చు చేసింది అని ముఖ్యంగా ఫ్లైట్స్ ట్రావెలింగ్ ఖర్చులకి వాళ్లు కోట్లల్లో ఖర్చు చేస్తున్నారు అని కూడా కథనాలు వెలువడుతున్నాయి.

తమ్మారెడ్డి కామెంట్స్
ఇక టాలీవుడ్ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా ఈ విషయంలో ఎవరు ఊహించని విధంగా స్పందించారు. RRR సినిమా భారీ బడ్జెట్ తో 600 కోట్లతో నిర్మించి ఉండవచ్చు. అయితే అయితే ఇప్పుడు వచ్చే ఆస్కార్ కోసం వాళ్ళు ఒక 80 కోట్లు పెట్టారు. అయితే అదే 80 కోట్లు ఇస్తే ఇక్కడ 8 సినిమాలు తీసేవారు ఉన్నారు. పది సినిమాలు కూడా తీస్తారు. కేవలం ఫ్లైట్ టికెట్ కోసమే దాదాపు కోట్లల్లో ఖర్చు పెడుతున్నారు అని కూడా ఆయన కామెంట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











