‘భరత్ అనే నేను’ 50 డేస్.... ఓవరాల్ కలెక్షన్ రిపోర్ట్
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 50 రోజులు పూర్తయింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ మహేష్ బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది. డివివి ఎంటర్టెన్మెంట్స్ నిర్మించిన ఈ పొలిటికల్ ఎంటర్టెనర్ ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2వేల థియేటర్లలో విడుదలైంది. మొదటి ఆట నుండే సూపర్బ్ రెన్పాన్స్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిసింది.

26 సెంటర్లలో 50 రోజులు
మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 26 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. సూపర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.

50 రోజుల కలెక్షన్ ఎంతంటే..
‘భరత్ అనే నేను' 50 రోజుల్లో వ్యాప్తంగా రూ. 225 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. తెలుగు సినిమా చరిత్రలో నాన్ బాహుబలి కేటగిరీలో హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

రూ. 65 కోట్ల బడ్జెట్...
ఈ చిత్రాన్ని రూ. 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్నీ కలిపి దాదాపు 140 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు రూ. 100 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మగా రూ. 115 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైనట్లు సమాచారం.
ప్రేక్షకులకు థాంక్స్
ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ డివివి ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ట్వీట్ చేసింది. టీమ్‌ను అభినందనలతో ముంచెత్తింది.


Click it and Unblock the Notifications











