twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భరత్ ప్రమాణం.. ఇక దేశమంతటా!

    |

    భరత్ అనే నేను చిత్రం విడుదలై అంతటా విజయ దుందుభి మోగిస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన భరత్ అనే నేను చిత్రం అంచనాలని అందుకుని ప్రేక్షకులని మెప్పిస్తోంది. ముఖ్యంగా మహేష్ నటన, కొరటాల దర్శకత్వానికి ప్రశంసలు దక్కుతున్నాయి. రాజకీయ పరమైన కథ కావడంతో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల కనెక్ట్ అవుతోంది.

    రాజకీయ నేపథ్యం ఉన్న కథ దృష్ట్యా ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోకి కూడా అనువదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దర్శకుడు కొరటాల ఈ చిత్రంలో లేవనెత్తిన రాజకీయ సమస్యలు దాదాపుగా అని రాష్ట్రాల్లో ఉన్నాయి. దీనితో భరత్ అనే నేను చిత్రం అన్ని భాషల అభిమానులని ఆకట్టుకునే అవకాశం ఉంది. త్వరలోనే భరత్ అనే నేను చిత్రాన్ని పలు భాషల్లోకి అనువదించబోతున్నట్లు కొరటాల తెలిపారు.

    Bharat Ane Nenu to dub in other languages

    కాగా ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచన తనకు లేదని తెలిపారు. పొలిటికల్ స్టోరీని కమర్షియల్ అంశాలతో కొరటాల తెరకెక్కించిన విధానం అద్భుతం అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కైరాకు భరత్ అనే నేను తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.

    English summary
    Bharat Ane Nenu to dub in other languages. Koratala Siva dont want to remake this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X