భరత్ అనే నేను ఫస్ట్ కాపీ రిపోర్ట్.. ‘బ్లాక్‌బస్టర్.. మహేష్ కెరీర్‌లోనే బిగ్ హిట్’!

By Rajababu

Recommended Video

Bharat Ane Nenu First Copy Report Biggest Hit Ever

శ్రీమంతుడు బ్లాక్‌బస్టర్ విజయం తర్వా త ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భరత్ అను నేను. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమాణం, డైలాగ్ టీజర్, టీజర్లు, ట్రైలర్లు సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తున్నాయి. బాలీవుడ్ నటి, ధోని 'ఫేం' కైరా అద్వానీ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 20న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ పనులను శరవేగంగా పూర్తి చేసుకోబోతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఇన్‌సైడ్ రిపోర్టు సోషల్ మీడియాలో హల్‌చల్ రేపుతున్నది.

 ఆడియోకు విశేష స్పందన

ఆడియోకు విశేష స్పందన

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భరత్ బహిరంగ సభ పేరుతో ఏప్రిల్ 7వ తేదీన భారీ ఎత్తున ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. ఆ రోజు విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.

రికార్డులు తిరుగరాయాలి..

రికార్డులు తిరుగరాయాలి..

భరత్ అనే నేను ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించాలి అని ఆయన ఆకాక్షించారు. ప్రేక్షకుల భాషలో చెప్పాలంటే రికార్డులను తిరుగరాయాలి అని ఎన్టీఆర్ అన్నారు.

 భరత్‌పై మహేష్ భారీ నమ్మకం

భరత్‌పై మహేష్ భారీ నమ్మకం

ఇప్పటికే ఈ చిత్ర విజయంపై ప్రిన్స్ మహేష్ బాబు భారీ నమ్మకం పెట్టుకొని ఉన్నారు. శ్రీమంతుడు తర్వాత తన కెరీర్‌లో నిలిచేపోయే అత్యుత్తమ చిత్రం అని ఆడియో సభలో పేర్కొన్నాడు.

భరత్ ఫస్ట్ కాపీ రిపోర్ట్

భరత్ ఫస్ట్ కాపీ రిపోర్ట్

మహేష్ అంచనాలకు తగినట్టే సినీ విమర్శకుడు ఉమేర్ సంధూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్.. భరత్ అనే నేను ఫస్ట్ కాపీ వచ్చింది. రెస్పాన్ చాలా అద్భుతంగా ఉంది. ఇన్‌సైడర్ వర్గాలు వెల్లడించిన ప్రకారం.. మహేష్‌బాబు కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిలువబోతుంది. భరత్ అనే నేను సినిమాతో మహేష్ రికార్డులు తిరగరాయడం ఖాయం అని ఉమేర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X