భరత్ అనే నేను ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. పక్కా బ్లాక్ బాస్టర్, మహేష్ చెప్పిందే నిజం!

Recommended Video

Bharat Ane Nenu Movie First Review.. It Is Blockbuster

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధం అయింది. మహేష్ బాబు ఈ చిత్రంలో పవర్ ఫుల్ సీఎం పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ రాజకీయ నాయకుడిగా నటించడం ఇదే తొలిసారి. భరత్ అనే నేను చిత్ర ట్రైలర్, స్టిల్స్ లో మహేష్ స్టైల్ ఫాన్స్ ని పిచ్చెక్కించే విధంగా ఉంది. అభిమానులంతా ఈ చిత్రంకోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి కొన్ని గంటల్లోనే భరత్ అనే నేను చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 20 శుక్రవారం ఈ చిత్రం విడుదలవుతున్నా సంగతి తెలిసిందే. ప్రముఖ సినీక్రిటిక్, దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమర్ సందు భరత్ అనే నేను చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. చిత్రం బ్లాక్ బాస్టర్ అని తేల్చేశాడు.

మహేష్ బాబు చెప్పినట్లుగానే

మహేష్ బాబు చెప్పినట్లుగానే

భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ మాట్లాడుతో ఈ చిత్రం తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ అని అన్నాడు. అది అక్షరాలా సత్యం అయిందని ఉమర్ సందు ఆంటున్నాడు. మహేష్ మొత్తం కెరీర్ లో ఈ చిత్రంలో అత్యుత్తమంగా మహేష్ బాబు నటించాడు.

ఎమోషనల్ సీన్స్‌లో ది బెస్ట్‌గా

ఎమోషనల్ సీన్స్‌లో ది బెస్ట్‌గా

ఎమోషనల్ సన్నివేశంలో మహేష్ బాబు నటన అద్భుతంగా ఉంది. యాక్షన్ సన్నివేశాల్లో సైతం మహేష్ క్లాస్ లుక్ లో అదరగొట్టాడు. చదువుకున్న వాడిగా, మంచి ముఖ్యమంత్రిగా మహేష్ ఈ చిత్రంలో కనిపిస్తాడు.

ముఖ్యమంత్రితో రొమాన్స్

ముఖ్యమంత్రితో రొమాన్స్

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కైరా అద్వానీ గ్లామర్, మహేష్ తో ఆమె కెమిస్ట్రీ ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచాయి. కైరా అద్వానీ పాత్రకు కూడా చాలా బలంగా ఉంటుంది.

సినిమాటోగ్రఫీ సూపర్

సినిమాటోగ్రఫీ సూపర్

భారత అనే నేను చిత్రానికి మరో ప్రధాన భలం సినిమాటోగ్రఫీ. ఎలివేటింగ్ సన్నివేశలలో మహేష్ ని చూపించిన విధానం అభిమానులని ఆకట్టుకోవడం ఖాయం. ప్రతి ప్రేమ్ రిచ్ గా తీర్చిదిద్దారు.

బలమైన కంటెంట్

బలమైన కంటెంట్

దర్శకుడు కొరటాల శివ ప్రత్యేకమైన శైలితో కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఆయన హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. మహేష్ తో కొరటాలకు రెండవ చిత్రం ఇది. భరత్ అనే నేను చిత్రంలో కొరటాల ఎక్కువగా కథపైనే దృష్టి పెట్టారు. బలమైన కంటెంట్ తో ప్రేక్షకులని కట్టిపడేసే విధంగా ఆయన దర్శత్వం ఉంది. ఆయన రాసిన డైలాగులు చాలా బావున్నాయి.

పక్కా బ్లాక్ బాస్టర్ అనడానికి కారణాలు

పక్కా బ్లాక్ బాస్టర్ అనడానికి కారణాలు

ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటన,హీరోయిజం ఎలివేట్ చేస్తూ దర్శకుడు మహెష్ ని చూపించిన విధానం, కైరా అద్వానీ గ్లామర్, డైలాగులు, సినిమాటోగ్రఫీ వంటి అంశాలు భరత్ అనే నేను చిత్రాన్ని పక్కా బ్లాక్ బాస్టర్ చేస్తాయని అనడంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X