»   » మహేష్ బహిరంగ సభ వేదిక ఖరారు.. నిజమైన రాజకీయ నాయకుడి తరహాలో!

మహేష్ బహిరంగ సభ వేదిక ఖరారు.. నిజమైన రాజకీయ నాయకుడి తరహాలో!

Subscribe to Filmibeat Telugu
Mahesh Babu Announced News About Bharat Ane Nenu

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 న విడుదలకు సిద్ధం అవుతోంది. శ్రీమంతుడు వంటి బ్లాక్ బాస్టర్ చిత్రం తరువాత మహేష్ బాబు కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఇదే. దీనితో భరత్ అనే నేను చిత్రంపై కనీ వినీ ఎరుగని విధంగా అంచనాలు నెలకొని ఉన్నాయి. శ్రీమంతుడు చిత్రంలో సొంత ఊరిని దత్తత తీసుకునే కోటీశ్వరుడి పాత్రలో మహేష్ కనిపించాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా అలరించబోతున్నాడు. ఈ తరహా పాత్రలో మహేష్ బాబు నటించడం ఇదే తొలిసారి. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది.

టీజర్కు రెస్పాన్స్ కేక

టీజర్కు రెస్పాన్స్ కేక

ఆ మధ్యన భరత్ అనే నేను చిత్ర టీజర్ విడుదల చేసారు. మహేష్ బాబు కిల్లింగ్ లుక్స్ అభిమానులని తెగ ఆకట్టుకున్నాయి. దీనితో చిత్రంపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

రాజకీయ నేపథ్యంలో

రాజకీయ నేపథ్యంలో

ఉమ్మడి ఏపీ రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. మహేష్ బాబుని కొరటాల ముఖ్యమంత్రిగా పవర్ ఫుల్ రోల్ లో చూపించబోతున్నాడు. తన క్రేజీ మాస్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేసే కొరటాల ఈ చిత్రాన్ని రసవత్తర పొలిటికల్ డ్రామాగా చూపించబోతున్నాడు.

కైరా అద్వానీతో రొమాన్స్

కైరా అద్వానీతో రొమాన్స్

సాధారణంగా రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రంలో హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండదనే భావన ఉంటుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. ఈమె మహేష్ బాబు పీఏ పాత్రలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. మీరు మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బహిరంగ సభ వేదిక ఖరారు

బహిరంగ సభ వేదిక ఖరారు

చిత్ర విడుదల సమయం దగ్గర పడుతుండడంతో భరత్ అనే నేను మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఏప్రిల్ 7 న భారీ ఈవెంట్ కు ప్లాన్ చేసారు. భరత్ బహిరంగ సభ పేరుతో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.

నిజమైన రాజకీయ నాయకుడి తరహాలో

నిజమైన రాజకీయ నాయకుడి తరహాలో

నిజమైన రాజకీయనాయకుడి తరహాలో అభిమానులని థ్రిల్ కు గురిచేసేలా ఈ ఈవెంట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 20 న ఏ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Bharat Ane Nenu movie team planning for huge event in LB stadium. Mahesh babu announced this news.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X