భరత్ అనే నేను ట్విట్టర్ రివ్యూ: బ్లాక్ బాస్టర్ టాక్.. మహేష్ ముఖ్యమంత్రిగా దుమ్ముదులిపాడు!

Recommended Video

Bharat Ane Nenu Movie Twitter Review

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ అనే నేను చిత్రంపై అటు ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనిఉన్నాయి. మహేష్ బాబు నటించిన గత రెండు చిత్రాలు నిరాశపరచడంతో కొరటాల శివ సూపర్ హిట్ కాబినేషన్లో వస్తున్న ఈ చిత్రం పక్కా బ్లాక్ బాస్టర్ అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహేష్ సరసన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఈ చిత్రంలో కనిపించబోతుండడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోల ప్రదర్శన ప్రారంభం అయింది. ట్విట్టర్ లో అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ అదిరిపోయేలా ఉంది.

ఫాన్స్‌కి ఫుల్ మీల్స్

భరత్ అనే నేను చిత్రం మహేష్ అభిమానులు పండగ చేసుకునే విధంగా ఉంది. అభిమానులకు ఇది ఫుల్ మీల్స్ లాంటి చిత్రం.

ఫస్ట్ హాఫ్ అదిరింది

ఫస్ట్ చాలా బావుంది. సెకండ్ హాఫ్ పరవాలేదనిపించే విధంగా ఉంది.

శ్రీమంతుడిని మించేలా

భరత్ అనే నేను చిత్రం శ్రీమంతుడుని మించేలా ఉంది. ప్రెస్ మీట్ సన్నివేశాల్లో మహేష్ నటన అదుర్స్.

అసెంబ్లీ సీన్స్, టైటిల్ సాంగ్ కన్నుల పండగే

అసెంబ్లీ సన్నివేశాల్లో మహేష్ బాబు చెబుతున్న డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. సింపుల్ గా, షార్ప్ గా ఉంటూ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

స్క్రీన్ ప్లే, మహేష్ నటన హైలైట్

దర్శకుడు కొరటాల శివ అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటున్నాడు. మహేష్ బాబు పెర్ఫామెన్స్ చాలా బావుంది.

మహేష్ అని అలా చూస్తే

హెలికాఫ్టర్ సన్నివేశంలో మహేష్ ని చూడాల్సిందే. మహేష్ కెరీర్ లో అదొక బెస్ట్ సీన్.

సెకండ్ హాఫ్ కూడా అదేస్థాయిలో

భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ కూడా అంచనాలని మించేలా ఉంది.

సోషల్ మెసేజ్

దర్శకుడు కొరటాల శివ భరత్ అనే నేను చిత్రం ద్వారా మంచి సోషల్ మెసేజ్ ని అందించాడు.

భరత్ అనే నేను చిత్రంలో హైలైట్స్

భరత్ అనే నేను చిత్రంలో దుర్గమహల్ ఫైట్ హైలైట్ గా నిలిచింది. మహేష్ ని ఆ సన్నివేశాలో చూపించిన విధానం చాలా బావుంది.

ప్రకాష్ రాజ్‌తో సన్నివేశాలు

అసెంబ్లీ సన్నివేశాల్ని కొరటాల చాలా బాగా తెరకెక్కించారు. ముఖ్యంగా మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ మధ్య సాగె చిత్రాలు చాలా బావున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X