twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భరత్ అనే నేను ప్రీ రిలీజ్ రివ్యూ: ప్రిన్స్ మహేష్ చేసిన మ్యాజిక్‌లు ఇవే..

    By Rajababu
    |

    Recommended Video

    Barath Ane Nenu : Koratala Shiva Interview With Anchor Pradeep

    సూపర్‌స్టార్ కృష్ణ నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రిన్స్ మహేష్‌బాబు కెరీర్‌లో ఎన్నో అద్బుతమైన విజయాలు, మరికొన్ని నిరాశ పరిచిన చిత్రాలు ఉన్నాయి. ఇటీవల శ్రీమంతుడు తర్వాత ప్రిన్స్ నటించిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. ఇలాంటి నేపథ్యంలో శ్రీమంతుడు కాంబినేషన్‌తో మళ్లీ రిపీచ్ చేశారు. దర్శకుడు కొరటాల శివ, మహేష్ బాబు కలిసి భరత్ అనే నేను సినిమా కోసం జతకట్టారు. రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రంగా రూపుదిద్దుకొన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 20న రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రాన్ని ఎందుకు చూడాలనే ప్రశ్నలకు ఫిల్మీబీట్ అందిస్తున్న సమాధానాలు ఇవే.

    సీఎంగా ప్రిన్స్ మహేష్‌బాబు

    సీఎంగా ప్రిన్స్ మహేష్‌బాబు

    గతంలో ప్రిన్స్ మహేష్‌బాబు దూకుడులో ఎమ్మెల్యేగా కనిపించారు. కాకపోతే అది రాజకీయ నేపథ్య చిత్రం కాకపోవడం గమనార్హం. ప్రస్తుతం భరత్ అనే నేను పూర్తిగా రాజకీయ నేపథ్యంగా రూపొందింది. ఈ చిత్రంలో యువ సీఎంగా మహేష్ కనిపిస్తారు. దాంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొన్నది. కేవలం రాజకీయాలే కాకుండా మాస్ అంశాలు, రొమాన్స్‌కు కూడా పెద్ద పీట వేశారు.

    కియారా అద్వానీ గ్లామర్

    కియారా అద్వానీ గ్లామర్

    భరత్ అనే నేను సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలకు పెద్ద పీట వేసినట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఈ చిత్రంలో ప్రిన్స్ సరసన ఎంఎస్ ధోని ఫేం కియారా అద్వానీ నటించారు. టీజర్లలో కియారా అందాలు ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి. ప్రకాశ్ రాజ్, రావు రమేష్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళీ, రాహుల్ రామకృష్ణ, ఇతర నటీనటులు నటించడంతో మరింత ఆసక్తిని పెంచింది.

    మదర్ సెంటిమెంట్

    మదర్ సెంటిమెంట్

    మహేష్‌కు స్పెషల్‌గా నిలిచిన ఈ సినిమాలో తల్లి సెంటిమెంట్‌కు బలంగా రూపకల్పన చేశారు. తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కుమారుడిగా మహేష్ అద్భుతంగా నటించారనే విషయం ఇప్పటికే హైలెట్‌గా నిలిచాయి. టీజర్లు, ట్రైలర్లు ఆ విషయాన్ని ప్రేక్షక ప్రపంచంలోకి బలంగా తీసుకెళ్లాయి.

     బుల్లెట్‌లా పేలే డైలాగ్స్, పాటలు

    బుల్లెట్‌లా పేలే డైలాగ్స్, పాటలు


    దర్శకుడు కొరటాల శివ చక్కటి సందేశంతో భరత్ అనే నేను చిత్రానికి రూపకల్పన చేశారు. ప్రిన్స్ మహేష్ ఇమేజ్‌కు అనుకూలంగా ఉండే పాత్రను అద్భుతంగా డిజైన్ చేసినట్టు ఇన్‌సైడ్ టాక్. అంతేకాకుండా ఆలోచింపజేసే డైలాగ్స్, స్ఫూర్తిని కలిగించే పాటలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ పంథాలోనే మెసేజ్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ స్కోప్‌ ఉన్న చిత్రంగా మలిచారు.

    దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ స్పెషల్

    దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ స్పెషల్

    భరత్ అనే నేను సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్స్. భరత్ అనే నేను థీమ్ సాంగ్, వచ్చాడయ్యా సామీ, ఐ డోంట్ నో పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. వచ్చాడయ్యో పాట కోసం రూ.4 కోట్లు ఖర్చు చేసి ఆలయం సెట్‌ను రూపొందించారు.

    థ్రిల్లింగ్‌గా ఫైట్స్ సీక్వెన్సెస్

    థ్రిల్లింగ్‌గా ఫైట్స్ సీక్వెన్సెస్

    భరత్ అనే నేను చిత్రంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కావడంతో యాక్షన్ సీన్లకు పెద్ద పీట వేశారు. ఈ చిత్రంలోని ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌ను కలుగజేస్తాయని ఇప్పటికే వార్తలు వైరల్‌గా మారాయి. 2 కోట్లతో ప్రత్యేకంగా అసెంబ్లీ సెట్‌ను రూపొందించారు.

    English summary
    ‘Bharat Ane Nenu’ is going to be out in no time. With Mahesh Babu and Koratala teaming up once again after ‘Srimanthudu’ for this political entertainer, fans and movie lovers are going crazy over this flick. So, we bring you few reasons on why you shouldn’t miss ‘Bharat Ane Nenu’ in theatres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X