భరత్ అనే నేను సక్సెస్ మీట్: మహేష్‌బాబు లేకపోతే ఈ సినిమా లేదు..

By Rajababu

ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భరత్ అనే నేను చిత్రం విజయఢంకా మోగిస్తున్నది. భారీ వసూళ్లను సాధిస్తూ బ్లాక్‌బస్టర్‌గా దిశగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో భరత్ అనే నేను సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్ మహేష్‌బాబు, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, కియారా అద్వానీ, డీవీవీ దానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ..

Recommended Video

'Bharath Ane Nenu' Movie Collections
ప్రేక్షకుల ఆదరణతో ఆనందంలో

ప్రేక్షకుల ఆదరణతో ఆనందంలో

మంచి ఆలోచనను రాయడం కథగా రాయడం తేలిక. కానీ అలాంటి ఆలోచనను పెద్ద హృదయంతో ప్రేక్షకులు ఆదరించడం చాలా కష్టమే. నిజాయితీతో కూడిన ప్రయత్నాన్ని ఆదరించడంతో మేము ఓ షాక్ గురయ్యాం. ఆనందంలో మునిగిపోయాం. ప్రేక్షకుల తీర్పుతో ఒక సంవత్సరం పాటు పడిన కష్టం దూది పింజలా ఎగిరిపోయింది. నేను స్క్రిప్టును ఎంతగా ప్రేమిస్తానో. నా టీం అంతగా ప్రేమిస్తుంది.

మహేష్‌బాబుతో ఉన్నప్పుడు..

మహేష్‌బాబుతో ఉన్నప్పుడు..

మహేష్ లాంటి హీరో ఉన్నప్పుడు స్ట్రిప్టు స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏదో చేయాలని, రాయాలని అనిపిస్తుంది. మహేష్‌కు ఓ ఛాలెంజింగ్ పాత్ర ఇవ్వాలని ఆరు నెలలు కష్టపడ్డాం. తెర మీద సినిమా చూసినపుడు మహేష్ నటన, ఆయన వేరియేషన్స్ చూసి డైరెక్టర్‌గా నేనే ఓ రకమైన ఫీలింగ్ కలిగింది.

 మహేష్‌బాబు సపోర్ట్ అద్భుతం

మహేష్‌బాబు సపోర్ట్ అద్భుతం

భరత్ అనే నేను సినిమా విషయంలో మహేష్ బాబు ఇచ్చిన సపోర్ట్ చాలా అద్భుతమైంది. మాట వరుసకు చెప్పడం లేదు. మీరు లేకపోతే భరత్ అనే నేను సినిమాకు ఇంత పెద్ద రిజల్ట్ రాదు. మహేష్ బాబు సినిమా అంటే ఇప్పుడు స్పెషలే. మళ్లీ మళ్లీ ఎప్పుడు ఆయనతో సినిమా చేయాలనే తప్పన ఉంటుంది.

 గొప్పగా చిత్రం తీయాలని

గొప్పగా చిత్రం తీయాలని

నా కెరీర్‌లో భారీ బడ్జెట్, ఎక్కువ రోజులు షూటింగ్ చేసింది ఇదే. అందుకు కారణం నిర్మాత డీవీవీ దానయ్య. ఖర్చు గురించి ఆలోచించవద్దు. కానీ ప్రతీ షెడ్యూల్‌కు ముందు సినిమా గొప్పగా రావాలని దానయ్య చెబుతుండేవారు. షూటింగ్ తర్వాత రాత్రి ఇంటికి వెళ్తే దానయ్యే గుర్తొచ్చేవారు. ఆయన అనుకున్నట్టు నేను సినిమా తీస్తున్నానా అనే అనుమానం కలిగేది.

దేవీ శ్రీ ప్రసాద్ ఉండే భయం ఉండదు

మ్యూజిక్ విషయంలో దేవీ శ్రీ ప్రసాద్ కోఆపరేషన్ అద్భుతం. ఆయన ఉంటే నాకు ఎలాంటి భయం ఉండదు. ఈ సినిమా కోసం దేవీ పడిన శ్రమ మాటల్లో చెప్పలేను అని కొరటాల అన్నారు. ఈ చిత్రంలో నటించిన బ్రహ్మాజీ, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ అందించిన ప్రోత్సాహం మరువలేనిది అని కొరటాల శివ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X