మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ టీజర్ వరల్డ్ రికార్డ్
Recommended Video

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భరత్ అనే నేను'. మహేష్ బాబు తొలిసారిగా నటిస్తున్న పొలిటికల్ మూవీ ఇది. ఇందులో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల 'విజయ్ ఆఫ్ భరత్' పేరుతో విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
రెండు వారాల క్రితం విడుదలైన ఈ టీజర్ ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 14 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అంతే కాకుండా 655k లైక్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ టీజర్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో అత్యంత ఎక్కువ మంది లైక్ చేసిన రెండో టీజర్‌గా రికార్డుల కెక్కింది.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు. తొలి పాటను మార్చి 25న ఉదయం 10గంటలకు విడుదల చేయబోతున్నారు.
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, రావు రమేష్, రవి శంకర్, పోసాని కృష్ణ మురళి, ఆమని, జీవా, బెనర్జీ, బ్రహ్మాజీ, అజయ్ కుమార్, సితార, రజిత, పృధ్వి, దేవరాజ్, యష్ పాల్ శర్మ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆడియో వేడుక ఏప్రిల్ 7న జరుగనుంది. డివివి ఎంటర్టెన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











