twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రికార్డులన్నీ బద్దలు: ‘భరత్ అనే నేను’ టీజర్ సంచలనం (టాలీవుడ్ టాప్ 10 లిస్టు ఇదే)

    By Bojja Kumar
    |

    Recommended Video

    Mahesh's Movie Is In Lead.. పవన్ కళ్యాణ్ ని వెనక్కి నెట్టేసిన మహేష్ బాబు

    మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వహించిన 'భరత్ అనే నేను' టీజర్ మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌ యూట్యూబ్, ఫేస్ బుక్‌లో అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ టీజర్లో మహేష్ బాబు చెప్పిన డైలాగుల దెబ్బకు.....బాహుబలి మినహా ఇప్పటి వరకు టాలీవుడ్లో వచ్చిన ట్రైలర్, టీజర్ వ్యూస్ రికార్డులన్నీ బద్దలయ్యాయి.

    24 గంటల లోపే 10 మిలియన్

    24 గంటల లోపే 10 మిలియన్

    మంగళవారం సాయంత్రం ‘భరత్ అనే నేను' టీజర్ విడుదలవ్వగా కేవలం 19 గంటల్లోనే 10 మిలియన్(కోటి) డిజిటల్ వ్యూస్ సాధించింది. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఇదే ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్. ఇందులో 7 మిలియన్ వ్యూస్ యూట్యూబ్ ద్వారా రాగా, 3 మిలియన్ వ్యూస్ ఫేస్ బుక్ ద్వారా వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ‘డివివి ఎంటర్టెన్మెంట్స్' ప్రకటించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

    నెం.1 స్థానంలో బాహుబలి 2

    నెం.1 స్థానంలో బాహుబలి 2

    యూట్యూబ్ వ్యూస్ పరంగా ఇప్పటి వరకు ‘బాహుబలి-2' ట్రైలర్ నెం.1 స్థానంలో ఉంది. ఈ ట్రైలర్ 24 గంటల్లో 21.7 మిలియన్ వ్యూస్ సాధించింది.

    నెం.2 ‘భరత్ అనే నేను'

    నెం.2 ‘భరత్ అనే నేను'

    మహేష్ బాబు మూవీ ‘భరత్ అనే నేను' యూట్యూబ్‌లో కేవలం 19 గంటల్లోనే 7 మిలియన్ పైగా వ్యూస్ సాధించి నెం.2 స్థానం దక్కించుకుంది.

    3, 4వ స్థానాల్లో అజ్ఞాతవాసి టీజర్

    3, 4వ స్థానాల్లో అజ్ఞాతవాసి టీజర్

    యూట్యూబ్ వ్యూస్ పరంగా అజ్ఞాతవాసి టీజర్ 24 గంటల్లో 6.4 మిలియన్ సాధించి మూడో స్థానంలో నిలిచింది. అజ్ఞాతవాసి ట్రైలర్ 6.2 మిలియన్ వ్యూస్ సాధించి 4వ స్థానంలో ఉంది.

    5వ స్థానంలో రంగస్థలం

    5వ స్థానంలో రంగస్థలం

    రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం' టీజర్ 24 గంటల్లో 5.9 మిలియన్ వ్యూస్ సాధించింది.

    6, 7వ స్థానంలో జై లవ కుశ

    6, 7వ స్థానంలో జై లవ కుశ

    జై లవ కుశ ఫస్ట్ టీజర్ యూట్యూబ్‌లో 24 గంటల్లో 5.4 మిలియన్ వ్యూస్ సాధించగా, రెండో టీజర్ 4.85 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

     8వ స్థానంలో దువ్వాడ జగన్నాధం

    8వ స్థానంలో దువ్వాడ జగన్నాధం

    ‘దువ్వాడ జగన్నాధమ్' మూవీ ట్రైలర్ యూట్యూబ్‌లో 24 గంటల్లో 4.6 మిలియన్ వ్యూస్ సాధించింది.

     9, 10 స్థానాల్లో స్పైడర్

    9, 10 స్థానాల్లో స్పైడర్

    మహేష్ బాబు గత చిత్రం ‘స్పైడర్' తొలి టీజర్ 24 గంటల్లో 4.2 మిలియన్ వ్యూస్ సాధించగా, రెండో టీజర్ 4 మిలియన్ వ్యూస్ సాధించింది.

    English summary
    The teaser of 'Bharat Ane Nenu' released yesterday evening and in less than 24 hours, the Mahesh Babu starrer had crossed 10 million views. 1 Cr digital views came in just 18 hours. It clocked in 7 million views on Youtube and 3 million views on Facebook beating records of all recent Telugu movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X