మహేష్ బాబు క్రేజ్: ‘భరత్ అనే నేను’ టికెట్స్ నిమిషాల్లోనే హాం ఫట్!

By Bojja Kumar

Recommended Video

Barath Ane Nenu : Mahesh Has Set Its Mark

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ నేటి నుండి మొదలైంది. బుక్ మై షో లాంటి సైట్లలో అలా టికెట్స్ పెట్టడమే ఆలస్యం వాటిని హాం ఫట్ అనిపించేశారు అభిమానులు. టికెట్స్ అందుబాటులోకి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే వేగంగా అమ్ముడు పోయాయి. ఫేమస్ మల్టీప్లెక్సులు, థియేటర్లలో ఆల్రెడీ హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తుండగా..... బి, సి గ్రేడ్ థియేటర్లలో కొన్ని టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి కూడా వేగంగా సోల్డ్ ఔట్ అవుతున్నాయి. ఏప్రిల్ 20న ఈ చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన ‘శ్రీమంతుడు' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. వీరి కాంబినేసన్లో వస్తున్న రెండో సినిమా ఇది. దీంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మహేష్ బాబు తొలిసారిగా ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న పొలిటికల్ ఎంటర్టెనర్ ఇది.

 బాక్సాఫీసు ప్రకంపణలు ఖాయం

బాక్సాఫీసు ప్రకంపణలు ఖాయం

‘భరత్ అనే నేను' చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. హిట్ కాంబినేషన్ కావడం, రికార్డు స్థాయిలో సినిమా విడుదలవుతుండటంతో బాక్సాఫీసు వద్ద భారీ ప్రకంపణలు సృష్టించడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

రికార్డు స్థాయిలో 2000 వేల ప్రీమియర్ షోలు

రికార్డు స్థాయిలో 2000 వేల ప్రీమియర్ షోలు

‘భరత్ అనే నేను' చిత్రం ప్రీమియర్ షోలు యూఎస్ఏలో కనీవినీ ఎరుగని స్థాయిలో వేస్తున్నారు. నార్త్ అమెరికా వ్యాప్తంగా దాదాపు 750 స్క్రీన్లలో సినిమా విడుదలకు ఒక రోజు ముందే దాదాపు 2000 ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఆయా షోలకు సంబంధించి టికెట్స్ అమ్ముడయ్యాయి.

వరల్డ్ వైడ్ భారీ రిలీజ్

వరల్డ్ వైడ్ భారీ రిలీజ్

‘భరత్ అనే నేను' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2 వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ స్క్రీన్ కౌంట్ రిలీజ్. ఈ చిత్రం మహేష్ బాబు గత చిత్రాలను తుడిచేయడమే కాకుండా.... ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

టెర్రిఫిక్ రిపోర్ట్స్

టెర్రిఫిక్ రిపోర్ట్స్

ఇటీవల ఫైనల్ ట్రయల్ షో వేయగా మహేష్ బాబు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ సినిమా చూశారు. మహేష్ బాబు కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందని అంటున్నారు. పొలిటికల్ ఎంటర్టెనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు. మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఏ సినిమాలోనూ రాజకీయ నాయకుడిగా నటించలేదు. ఆయన చేస్తున్న తొలి పొలిటికల్ మూవీ ఇది. ఇందులో మహేష్ బాబు సరికొత్త పెర్ఫార్మెన్స్ చూడబోతున్నామని, ఆయన కెరీర్లోనే ది బెస్ట్ అనే విధంగా ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాడని టాక్.

కొరటాల మరోసారి అదరగొట్టాడు

కొరటాల మరోసారి అదరగొట్టాడు

కట్టి పడేసే కథ, కథనంతో కొరటాల శివ మరోసారి తన రైటింగ్ స్కిల్స్ అద్భుతంగా ప్రదర్శించారని, ఉత్కంఠ భరితంగా ఈ సినిమాను తెరకెక్కించారని అంటున్నారు. అతడు బేసిగ్గా రైటర్ కావడంతో స్క్రిప్టు అద్భుతంగా వచ్చిందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి.

ఎంటర్టెన్మెంట్ మిస్సవ్వకుండా

ఎంటర్టెన్మెంట్ మిస్సవ్వకుండా

పొలిటికల్ నేపథ్యం అనగానే సీరియస్ సాగే మూవీ అనుకోవద్దని... దాంతో పాటు హాస్యం, ప్రమకథ, యాక్షన్ ఇలా అన్నీ సమపాళ్లలో జోడించి ప్రేక్షకులు పూర్తి స్థాయిలో సంతృప్తిపడేలా ఉంటుందని, ఈ చిత్రానికి సంగీతం, సినిమాటోగ్రఫీ హైలెట్‌గా ఉంటుందని చిత్ర బృందం వెల్లడించారు.

రికార్డులను బద్దలు కొట్టే పొటెన్షియల్ ఉన్న సినిమా

రికార్డులను బద్దలు కొట్టే పొటెన్షియల్ ఉన్న సినిమా

యకె/యూఏఈలో సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా ఉన్న ఉమైర్ సంధు ‘భరత్ అనే నేను' సినిమా గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి ఫైనల్ ట్రయల్ పూర్తయింది. వాటి ద్వారా వస్తున్న రిపోర్ట్స్ టెర్రిఫిక్‌గా ఉన్నాయి. మహేష్ బాబు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సినిమా చూశారు. అద్భుతమైన కథతో సినిమా ఆకట్టుకుంటుందని, మహేష్ బాబు కెరీర్లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని అంతా పొగిడేస్తున్నారు. నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టే పొటెన్షియల్ ఉన్న సినిమా ఇది అంటూ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X