పడిపోయావే చిత్రాన్ని తీయడానికి అనేక సమస్యలు.. భరత్ అంకటి
శ్రీ రాజన్న మూవీస్ మహేష్ ఎంటర్తైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం పడిపోయా నీ మాయలో. మహేష్ పైడ దర్శకత్వం వహిసున్న చిత్రానికి ,భరత్ అంకటి నిర్మాత. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ రామకృష్ణ గౌడ్, ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.
పడిపోయా నీమాయలో నిర్మాత భరత్ అంకటి మాట్లాడుతూ.. ఈ సినిమా దర్శకుడు ఆర్కేతో నాకు పదమూడు సంవత్సరాల స్నేహం ఉంది. చాలా మంచి మనిషి. ఈ సినిమా చెయ్యడానికి చాలా సమస్యలను ఎదుర్కొన్నాం. ఇబ్బందుల్లో ఉన్నామని మా నిర్మాత మహేష్ మమ్మల్ని ఆదుకున్నారు. ఈ సినిమా కథా కథనాలు చాలా ఆసక్తిగా ఉంటాయి అని అన్నారు.


Click it and Unblock the Notifications











