భరత్ అను నేను ఆడియో లైవ్.. ఇలాంటి ఫంక్షన్ ఇంతవరకు చూడలేదు.. దిల్ రాజు
దర్శకుడు కొరటాల శివ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భరత్ అనే నేను ఆడియో ఆవిష్కరణ సభ ఘనంగా జరుగుతున్నది. ఈ వేడుక కోసం ఇప్పటికే ప్రిన్స్ మహేష్‌బాబు వేదిక వద్దకు వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన దిల్ రాజు, వంశీ పైడిపెళ్లి మాట్లాడారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీ వచ్చి 23 ఏళ్లు అయింది. నా కెరీర్‌లో ఇలాంటి ఫంక్షన్‌ను చూడలేదు. నిర్మాతలు దానయ్యకు థ్యాంక్స్. మహేష్, బాబు ఎన్టీఆర్ అభిమానులకు శుభాకాంక్షలు. ఓ స్టార్ హీరో సినిమాకు మరో స్టార్ హీరో ముఖ్య అతిథిగా రావడం చక్కటి పరిణామం. థ్యాంక్స్ తారక్. భారతీయ సినిమా పరిశ్రమకు ఇది మార్గదర్శకం కావాలి అని అన్నారు.
భరత్ అనే నేను సినిమా ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై విమర్శనాస్త్రం. కొరటాల శివ చిత్రంలో మంచి సందేశం ఉంటుంది. ఈ సినిమాలో కూడా చక్కటి సందేశాన్ని అందించారు అని దిల్ రాజు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











