భరత్ బహిరంగ సభ : నందమూరి తారకరామారావు గారి మనవణ్ణి అయిన నేను.. మహేష్ నాకు అన్న!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 న ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది. కాగా నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భరత్ బహిరంగ సభతో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ ఈ వేడుకలో అద్భుతంగా ప్రసంగించారు. నందమూరి తారక రామారావు గారి మనవణ్ణి అయిన నేను అంటూ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

 ముఖ్య అతిథిగా రాలేదు.. కుటుంబ సభ్యుడిగా వచ్చా

ముఖ్య అతిథిగా రాలేదు.. కుటుంబ సభ్యుడిగా వచ్చా

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నేను ఈ వేడుకకు ముఖ్య అతిధిని అంటున్నారు. నేను ముఖ్య అతిధిగా రాలేదు. మహేష్ కుటుంబ సభ్యుడిగా వచ్చాను అని తెలపడంతో ఎల్బీ స్టేడియం మారుమ్రోగిపోయింది. మీరంతా ఆయన్ని ప్రిన్స్, సూపర్ స్టార్ అని అంటారు. కానీ నేను మాత్రం ఆయన్ని మహేష్ అన్న అని అంటానని ఎన్టీఆర్ తెలపడంతో మరోమారు అభిమానులు కేరింతలతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఏ చిత్రం అద్భుత విజయం సాధించాలని ఎన్టీఆర్ అన్నారు. అభిమానుల భాషలో చెప్పాలంటే ఈ చిత్రం రికార్డులు తిరగరాయాలని కోరుకుంటున్నట్లు ఎన్టీఆర్ తెలిపాడు.

 అరుదైన రకం మహేష్

అరుదైన రకం మహేష్

మహేష్ అన్న చాలా అందంగా ఉంటారు. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఓ కమర్షియల్ హీరో అయి ఉండి అనేక ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారని ఎన్టీఆర్ తెలిపాడు. ఆయన ఆదర్శంతోనే తామంతా ఇప్పుడిప్పుడే ఆ తరహా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నామని ఎన్టీఆర్ తెలిపాడు. ఈ సందర్భంగా జనతా గ్యారేజ్ చిత్రంలోని ఓ డైలాగ్ ని ప్రస్తావిస్తూ మహేష్ పై ప్రశంసలు కురిపించాడు. ఆయన అరుదైన రకం..ఆయన్ని అలాగే ఉండనిద్దాం అని ఎన్టీఆర్ తెలిపాడు.

బృందావనం నుంచి

బృందావనం నుంచి

కొరటాల శివతో తన జర్నీ బృందావనం చిత్రం నుంచే ప్రారంభం అయిందని ఎన్టీఆర్ అన్నారు. కొరటాల శివ తనకు బ్రదర్ లాంటి వారని అన్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్, నిర్మాత డడివివి దానయ్యకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేసాడు. టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కైరా అద్వానీని కూడా విష్ చేయడం విశేషం.

ట్రైలర్ లాంచ్ చేసిన ఎన్టీఆర్

అంతకు ముందు ఎన్టీఆర్ భరత్ అనే నేను చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసాడు. ఎన్టీఆర్ స్వయంగా ట్రైలర్ లాంచ్ చేయడంతో అభిమానుల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X