భరత్ బహిరంగ సభ: మహేష్ మరోసారి రిపీట్ చేయండి.. కైరా అద్వానీ
దర్శకుడు కొరటాల శివ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భరత్ అనే నేను ఆడియో ఆవిష్కరణ సభ ఘనంగా జరుగుతున్నది. ఈ వేడుక కోసం ఇప్పటికే ప్రిన్స్ మహేష్‌బాబు వేదిక వద్దకు వచ్చారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, వంశీ పైడిపెళ్లి, ప్రకాశ్ రాజ్, దేవీ శ్రీ ప్రసాద్, రామజోగయ్యశాస్త్రి, అనిల్ సుంకర, కైరా అద్వానీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కైరా అద్వానీ మాట్లాడారు.
అద్భుతమైన స్వాగతం పలికిన హైదరాబాద్‌కు థ్యాంక్స్. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాత డీవీవీ దానయ్యకు ధన్యవాదాలు. దర్శకులు శివ కొరటాల గారికి థ్యాంక్స్.
మహేష్ బాబుతో నటించే అవకాశం రావడం చాలా అదృష్టం. మహేష్ బాబును మొదటిసారి కలిసినప్పుడు సార్ అని పిలిచాను. అయితే సార్ అని పిలువవద్దని అని అన్నారు. కానీ నేను ఆ అలవాటును మానలేకపోయాను. ప్రిన్స్ మహేష్ తన సినిమాలో ఒక హీరోయిన్‌కు ఒకేసారి అవకాశం ఇస్తారు. కానీ మళ్లీ మహేష్ సరసన నటించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను అని కైరా అద్వానీ అన్నారు.


Click it and Unblock the Notifications











