భరత్ బహిరంగ సభ.. మహేష్ ఒక్కసారి నమ్మితే.. ఐదు గంటలు కథ చెప్పా.. కొరటాల
దర్శకుడు కొరటాల శివ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భరత్ అనే నేను ఆడియో ఆవిష్కరణ సభ ఘనంగా జరుగుతున్నది. ఈ వేడుక కోసం ప్రిన్స్ మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, వంశీ పైడిపెళ్లి, ప్రకాశ్ రాజ్, దేవీ శ్రీ ప్రసాద్, రామజోగయ్యశాస్త్రి, అనిల్ సుంకర, కైరా అద్వానీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడారు.

భక్తి, భయం, శ్రద్దలతో
కొరటాల శివ అనే నేను.. ఈ సినిమాను భయం, భక్తి, శ్రద్ధలతో తీసానని హామీ ఇస్తున్నాను. నేను మాట్లాడాన్ని మీరు కాస్త భరించాలి. ఎందుకంటే చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి.

ఐదు గంటల కథ
ఈ సినిమా కథను మహేష్ బాబుకు చెప్పేముందు.. ఇది చాలా పెద్ద కథ.. మామూలుగా చెప్పలేను అని అన్నాను. వేరే ఊరు వెళ్లి ఓ హెల్త్ రిస్టారులో కథ చెప్పాను. ఫస్టాఫ్ రెండున్నర గంటలు.. సెకండాఫ్ రెండున్నర గంటలు కథ చెప్పాను. మహేష్ ఏమి మాట్లాడలేదు గానీ.. సినిమా ఐదు గంటలు ఉంటుందా అని మాత్రమే అడిగారు.

మహేష్ ఒక్కసారి నమ్మితే..
మహేష్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అద్భుతం. ఒక్కసారి నమ్మితే చాలా గొప్పగా ఉంటుంది. మహేష్ బాబు హ్యాండ్సమ్ సీఎంగా, డైనమిక్ గా కనిపిస్తారు. థ్యాంక్స్ మహేష్ బాబు.. మీరు నమ్మకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు.

గొప్ప సినిమా తీయాలి
నిర్మాత డీవీవీ దానయ్యకు కథ చెప్పగానే నాకు గొప్ప సినిమా ఇవ్వాలని అన్నారు. ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు. చాలా రిచ్‌గా చేయాలని అంటుండేవారు. అందుకు దానయ్య గారికి థ్యాంక్స్.
పొలిటికల్ వాతావరణం
భరత్ అను నేను సినిమాకు ముందు పొలిటికల్ వాతావరణం అలవాటు లేదు. కానీ సినిమాటోగ్రాఫర్ పనిచేసిన తీరు అద్భుతం. అందుకే ఈ సినిమా గొప్పగా వచ్చింది.


Click it and Unblock the Notifications











