కైరా అద్వానీని మరిచిన మహేష్.. చివరికి అలా హామీ ఇచ్చిన ప్రిన్స్
ప్రిన్స్ మహేష్ బాబుతో నటించాలని ఎందరో అందాల తారలు కలలు కంటారు. కానీ కొందరికే ఆయన పక్కన నటించే అవకాశం లభిస్తుంది. ఒక్కసారి మహేష్ పక్కన నటించిన హీరోయిన్లకు మరోసారి ఆయన పక్కన నటించే అవకాశం చాలా తక్కువ. తాజాగా రిలీజ్ కానున్న భరత్ అనే నేను సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్. అంతకు ముందు కైరా ధోని బయోపిక్‌లో నటించింది.
ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌లో మహేష్ పక్కన మరోసారి నటించాలని కోరుకొన్నది. అయితే ఆమెకు మళ్లీ అవకాశం ఇస్తానని మహేష్ హామీ ఇచ్చాడు. తన ప్రసంగంలో కైరా గురించి మాట్లాడటం మహేష్ మరిచిపోవడంతో దర్శకుడు కొరటాల శివ గుర్తు చేశారు. ఆ నేపథ్యంలో కైరా గురించి ఆయన మాట్లాడారు.

భరత్ అనే నేను సినిమా చేస్తున్నప్పుడు సినిమాకు కొత్త హీరోయిన్ కావాలి అని నేను, కొరటాల శివ అనుకొన్నాం. ఈ సినిమాలో లవ్ స్టోరికి చాలా ప్రాధాన్యం ఉంది. పెద్ద హీరోయిన్ చేస్తే సరిగా ఉండదు అని భావించాం. కైరా అద్వానీని ఎంపిక చేశాం. కైరాతో నటించే అవకాశం రావడం గొప్ప విషయం. కైరాతో కలిసి మళ్లీ పనిచేస్తాను అని మహేష్ అన్నారు. దాంతో కైరా చాలా ఆనందంలో మునిగిపోయింది.


Click it and Unblock the Notifications











