కొరటాల కథ చెప్పగానే భయపడ్డా.. వణికిపోయా.. తల్లిని తలుచుకొని మహేష్ ఉద్వేగం..
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా ప్రిన్స్ మహేష్‌బాబుకు తన కెరీర్‌లోనే కీలకంగా నిలిచింది. ఆ తర్వాత వస్తున్న భరత్ అనే నేను కూడా నా జీవితంలో కీలకమైంది అని మహేష్ అంటున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 20న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో భరత్ బహిరంగ సభ అనే పేరుతో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన ఏమన్నారంటే..

కృష్ణగారి అబ్బాయి అనే నేను
కృష్ణ గారి అబ్బాయి అనే నేను.. తమ్ముడు ఎన్టీఆర్ నుంచి మాటలు నేర్చుకొన్నాను. ఆడియో ఫంక్షన్‌కు వచ్చినట్టు లేదు. ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్‌కు వచ్చినట్టు ఉంది. భరత్ అనే నేను వేడుకకు వచ్చిన అందరికీ నమస్కారం.

తారక్ ఆది ఫంక్షన్‌కు నేను వెళ్లా
తారక్‌కు గుర్తొందో లేదో గానీ.. ఆయన నటించిన ఆది సినిమాకు నేను ముఖ్య అతిథిగా వెళ్లాను. ఇప్పుడు ఎన్టీఆర్ నా ఆడియో ఫంక్షన్‌కు వచ్చారు. తారక్ ఈ ఫంక్షన్‌కు వచ్చినందుకు చాలా థ్యాంక్స్.

ఇక నుంచి ట్రెండ్ మారుతుంది
ఎన్టీఆర్ రావడం గొప్ప శుభసూచకం. పరిశ్రమలో తిప్పి కొడితే ఐదు, ఆరుగురు పెద్ద హీరోలు ఉన్నారు. ఏడాదికి ఒక్క సినిమానే చేస్తాం. మేమంత బాగానే ఉంటాం. ఫ్యాన్సే మధ్య గొడవలు ఉంటాయి. ఇక నుంచి ట్రెండ్ మారుతుంది. అందరు ప్రతీ పెద్ద హీరో సినిమాకు హీరోలు వెళ్తారు. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇక మీరే బాగుండాలి.

శివ కథ చెప్పినప్పుడు వణికిపోయా
శివగారికి సినిమా థ్యాంక్స్ చెప్పాలి. సినిమా కథ చెప్పినప్పుడు భయం వేసింది. సీఎం పాత్ర అనగానే వణుకు పుట్టింది. ఎందుకంటే నాకు రాజకీయాలు తెలియవు. వాటికి దూరంగా ఉంటాను. కానీ కథ చెప్పినప్పుడు ఇన్స్‌పిరేషన్‌గా ఫీలయ్యాను. ఈ సినిమాలో నా ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. శ్రీమంతుడు తర్వాత మళ్లీ అద్భుతమైన సినిమాను కొరటాల శివ ఇచ్చారు. నా జీవితంలో భరత్ అనే నేను చాలా ఇంపార్టెంట్ ఫిలిం అంతమంచి సినిమాను ఇచ్చిన శివకు నేను రుణపడి ఉంటాను.

డీవీవీ దానయ్యకు థ్యాంక్స్
దానయ్య గురించి ఎక్కువగా చెప్పనక్కర్లేదు. సినిమా ఎప్పుడు గ్రాండ్‌గా ఉండాలని ఆయన అంటారు. సినిమా గ్రాండ్ వచ్చింది దానయ్య గారు అని మహేష్ అన్నారు. గొప్ప చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దానయ్యకు థ్యాంక్స్

మీరు మళ్లీ హిట్ కొట్టాలి
దేవీ శ్రీ ప్రసాద్‌కు నేను గొప్ప ఫ్యాన్‌ని. మొన్న రంగస్థలం సినిమా చూశాను. ఆ సినిమాకు మా సినిమాకు ఎక్కడ పోలీక ఉండదు. వారం రోజుల గ్యాప్‌లో అలాంటి వేరియేషన్ ఉన్న మ్యూజిక్‌ను ఎలా చేస్తాడో అర్థం కాదు. భరత్ అనే నేను సినిమా థీమ్ సాంగ్, వచ్చాడయో సామీ నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్ అనుకొంటాను. రామజోగయ్య శాస్త్రి మళ్లీ మీరు హిట్ కొట్టాలి అని మహేష్ అన్నారు.

బయట నుంచి వయలెంట్‌గా
సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్ పనితీరు అద్భుతం. ఫైటర్లు రామ్ లక్ష్మణ్ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. బయట నుంచి చూస్తే చాలా వయలెంట్‌గా ఉంటారు. కానీ లోపల మాత్రం చాలా సున్నితంగా ఉంటారు. వాళ్లు పొద్దున లేస్తారు. యోగా చేస్తారు. వాళ్లతో చాలా సినిమాలు పనిచేశాను కానీ వాళ్లిద్దరిలో రామ్ ఎవరో, లక్ష్మణ్ ఎవరో తెలియదు.

20 తేదీ అమ్మ పుట్టిన రోజు
భరత్ అనే నేను రిలీజ్ అయ్యే ఏప్రిల్ 20 తేదీ నా అమ్మగారు ఇందిరమ్మ పుట్టిన రోజు. అమ్మ ఆశీస్సులు, దీవెనల కంటే ఏది గొప్పది.. మించింది ఏదీ లేదు. ఆ రోజు సినిమా రిలీజ్ కావడం అదృష్టం. అభిమానులు ఆశీస్సులు, దీవెనలు నాకు ఉండాలి.

కైరాతో మళ్లీ సినిమా చేస్తాను..
భరత్ అనే నేను సినిమా చేస్తున్నప్పుడు సినిమాకు కొత్త హీరోయిన్ కావాలి అని నేను, కొరటాల శివ అనుకొన్నాం. ఈ సినిమాలో లవ్ స్టోరికి చాలా ప్రాధాన్యం ఉంది. పెద్ద హీరోయిన్ చేస్తే సరిగా ఉండదు అని భావించాం. కైరా అద్వానీని ఎంపిక చేశాం. కైరాతో నటించే అవకాశం రావడం గొప్ప విషయం. మళ్లీ కలిసి పనిచేద్దాం అని కైరాను ఉద్దేశించి మహేష్ మాట్లాడారు.


Click it and Unblock the Notifications











