భరత్ అను నేను ఆఢియో.. ప్రకాశ్ రాజ్‌కు చేదు అనుభవం
దర్శకుడు కొరటాల శివ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భరత్ అనే నేను ఆడియో ఆవిష్కరణ సభ ఘనంగా జరుగుతున్నది. ఈ వేడుక కోసం ప్రిన్స్ మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, వంశీ పైడిపెళ్లి, ప్రకాశ్ రాజ్, దేవీ శ్రీ ప్రసాద్, రామజోగయ్యశాస్త్రి, అనిల్ సుంకర, కైరా అద్వానీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడారు.
భరత్ అనే నేను సినిమా వేడుక వచ్చిన జనాన్ని చూస్తే ఆనందం వేసింది. అంతకంటే నా ఫేవరేట్ యాక్టర్లు మహేష్‌బాబు, ఎన్టీఆర్‌ను చూస్తుంటే ఇంకా చాలా ఆనందం వేసింది. వారంటే నాకు చాలా గౌరవం ఉంది. కొరటాల శివతో మిర్చి సినిమాలో చేయాల్సి ఉంది. ఆ తర్వాత శివ తీసిన జనతా గ్యారేజ్, శ్రీమంతుడు సినిమాలు చూసిన తర్వాత ఇంకా గౌరవం పెరిగింది అని ప్రకాశ్ రాజ్ అన్నారు.
ప్రస్తుతం పరిస్థితుల్లో సినిమా అనేది చాలా వ్యయంతో కూడుకొన్నది. తెలుగు సినిమా అంటే వినోదమే కాదు అని మాట్లాడుతుండగా ప్రేక్షకులు గొడవ చేయడంతో ప్రకాశ్ రాజ్ మధ్యలోనే ప్రసంగాన్ని ఆపివేసి వెళ్లారు.


Click it and Unblock the Notifications











