మళ్ళీ సీనులోకి తారకరత్న

By Staff

Taraka Ratna
ఆ మధ్య గుంటూరు పరిశర ప్రాంతాల్లో పర్యటించి ప్రసంగించి,వివాద స్పద వ్యాఖ్యలు సైతం చేసిన తారక రత్న మళ్ళీ సీన్ లోకి వచ్చారు. తన తాతగారు ప్రముఖ నటుడు, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ. రామారావుకు భారతరత్న అవార్డును ప్రకటించేంతవరకు తెలుగు ప్రజలంతా ఉద్యమించాలని నందమూరి తారక రత్న పిలుపునిచ్చారు. తమిళ నటుడు ఎంజీఆర్‌ మాదిరిగానే ఎన్టీఆర్‌కు కూడా అవార్డు ఇచ్చి ఆయన పేరు ఒక జిల్లాకు పెట్టాలని తారకరత్న డిమాండ్‌ చేశారు.

మరో ప్రక్క ఎన్టీఆర్‌ కు భారతరత్న ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత ఎన్టీఆర్‌ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీపతిరాజేశ్వర్‌ బుధవారం ఇందిపార్కువద్ద ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తారకరత్న ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి దీక్షను ప్రారంభించారు.

బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ పటేల్‌, పట్వారీ వ్యవస్థకు చరమగీతం పాడి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అధికారం కట్టబెట్టిన ఘనత ఎన్టీఆర్‌దేనని పేర్కొన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యులు అల్లాడి రాజ్‌కుమార్‌, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, టీడీపీ నేత విజయరామారావులు కార్యక్రమంలో మాట్లాడారు.ఇక శ్రీపతిరాజేశ్వర్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేంతవరకు పోరాడాతామని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X