వర్మపై బలపడుతున్న కేసు

ఈ మేరకు సరైన వివరణ ఇవ్వాల్సిందిగా ఆ అసోసియేషన్ వర్మకి ఓ లేఖ రాసింది. 'సత్య', 'కంపెనీ', 'మస్త్', 'జంగల్' చిత్రాల్ని నిర్మించే సమయంలో ఈ మొత్తం తన నుంచి తీసుకున్నారని భరత్ షా ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్మ కార్పొరేషన్ లిమిటెడ్‌లో మరో రూ.10 కోట్ల విలువ చేసే షేర్లు ఇస్తానని కూడా మాట ఇచ్చి ఇప్పుడేమీ మాట్లాడట్లేదని భరత్ షా ఆరోపిస్తున్నారు. అయితే వర్మ ఈ కొత్త వివాదంపై మీడియా ముందు మాట్లాడటానికి ఇష్టపడటం లేదు.
మరో ప్రక్క భరత్ షా తో రాజీ పడటానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే భరత్ షా మాత్రం అమీ తుమీ తేల్చుకుంటానని...మండిపడుతున్నాడని ముంబయి పత్రికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం వర్మ ఫూంఖ్ తెలుగు వెర్షన్ అయిన రక్ష సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











