భూమిక భర్తే ..'తకిట తకిట' హీరోయిన్స్ కి ఫుల్ ట్రైనింగ్ !?
ఆరు నెలల పాటు భరత్ ఠాకూర్ సార్ యాక్టింగ్, డాన్సింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చారు. ముందే అలా ప్రిపేర్ అయి షూటింగ్‌కు వెళ్లడంతో కెమెరా ముందు ఈజీగా నటించేశాను. మరో విషయం చెప్పనా ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను' అంటూ మురిసిపోతూ చెప్తోంది. తకిటతకిట' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన అదితి. ఆమె ఈ చిత్రంలో ఓ తమళ అమ్మాయి నందిత గా చేసింది. తండ్రికి మస్కా కొట్టి ప్రేమించినవాడితో లేచిపోయే పాత్ర అది. ఇక ఆమె విషయం ప్రక్కన పెడితే భరత్ ఠాకూర్ ఇన్నాళ్ళూ..యోగా కదా నేర్పించేది..ఈమేంటి ఇలా ఆయనే యాక్టింగ్,డాన్సింగ్ అంటోందని అంటున్నారు. లేకపోతే తమ సినిమా కాబట్టి ప్రత్యేక శ్రధ్ద తీసుకుని ఆమెకి నేర్పించారేమో అని కొందరు సర్ది చెప్పుకుంటున్నారు.
ఇక ఈ తకిట తకిట చిత్రాన్ని గతంలో భూమికతో సత్యభామ చిత్రం తీసిన శ్రీహరి నాను డైరక్ట్ చేసారు. ఈ సినిమా రిజల్టు ప్రక్కన పెడితే... ఈ కొత్త హీరోయిన్ మాత్రం తెలుగులో హీరోయిన్‌గా స్ఠిరపడాలని ఉందంటోంది. ఆమె మాటల్లనే... ' మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను' అన్నారు అదితి. అలాగే నాగార్జున, భూమిక, అనుష్క తన అభిమాన నటీనటులని చెప్తూ...'మోస్ట్ రొమాంటిక్ హీరో నాగార్జునగారు. అలాగే చాలా మంచి మనిషి కూడా.అలాగే మా భూమిక నటనని కూడా అభిమానిస్తాను. 'అరుంధతి' చిత్రం చూసి అనుష్క ఫాన్ అయిపోయాను. అలాగే గ్లామర్ రోల్స్‌లో కూడా ఆమె సుపర్బ్ గా ఉంటుంది' అన్నారు. ఇక నాగార్జున, అనుష్క ఇద్దరూ...ఈ తకిట తకిట చిత్రంలో చిన్న చిన్న పాత్రలు చేసారు.


Click it and Unblock the Notifications











