నందమూరి బాలకృష్ణకు ‘భరతముని’ అవార్డు!
సినీ రంగంలోని ప్రముఖులను గుర్తించి అవార్డులను ఇవ్వడం గర్వించదగ్గ విషయమని పలువురు వక్తలు అన్నారు. ఈ అవార్డులను ఆదివారం రాత్రి సుందరయ్య కళానియంలో 'భరతముని ఆర్ట్స్ అకాడమీ ఆద్వర్యానా భరతముని 22వ తెలుగు చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ సభ జరిగింది. దీనికి ఆంధ్రప్రభ సంపాదకుడు పి.విజయబాబు అధ్యక్షత వహించారు.
ఈసందర్భంగా యువరత్న బాలకృష్ణ ఖాతాలో మరో అవార్డు చేరింది. అది కూడా ఆయన ఎంతో ఇష్టపడి చేసిన 'పాండురంగడు" సనిమాకి వచ్చింది. ఆదివారం సాయంత్రం సుందరయ్య విజ్ఝానకేంద్రంలో ఈ భరతముని అవార్డుని బాలకృష్ణ అందుకున్నారు. ఇదే చిత్రానికిగానూ నటి శివపార్వతి, రచయిత సుద్దాల అశోక్ తేజ కూడా ఈ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటి అవార్డును 'నచ్చావులే" సినిమాకు మాధవీలత అందుకుంది. ఇంకా పలువురు సినీ కళాకారులకు భరతముని అవార్డును ఈ సంస్థ ప్రదానం చేసింది.
బాలకృష్ణ భరతముని అవార్డు పాండురంగడు సుందరయ్య కళానియం శివపార్వతి నచ్చావులే మాధవీలత balakrishna bharatamuni award pandurangadu sundaraiah kala nidhi sivaparvathi nachavule madhavi latha


Click it and Unblock the Notifications