twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్ళ దగ్గరినుండి చాలా నేర్చుకున్నాను, ఆయన చరిత్ర తిరగరయబోయే సినిమా తీస్తున్నాడు!

    |

    భరత్ అనే నేను సినిమా రేపు విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు కొరటాల శివ, లిరిక్ రైటర్ రామ జోగయ్య శాస్త్రి, నిర్మాత డివివి దానయ్య మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా వారు సినిమా గురించి మాట్లాడడం జరిగింది.

    రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ...
    ఇది ఒక నిజాయితితో కూడిన సినిమా ఇది. మన ఆలోచనలో మార్పు తెచ్చే సినిమా భరత్ అనే నేను. అందరిని ఆలోచింపచేసే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. నేను రాసిన పాటలకు మంచి గౌరవం లభిస్తుంది. వాణిజ్య అంశాలతో పాటు ఈ సినిమాలో చిన్న సందేహం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్, సెకండ్ హాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగా వచ్చాయి. దేవి ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది. సీతారామ శాస్త్రి తరువాత మీరే ఆ స్థాయిలో రాస్తున్నారు అని ఒకతను కాల్ చేసి చెప్పడం ఆనందమేసింది. నిర్మాత అశ్విని దత్ గారు నా పాటలను మెచ్చుకోవడం మర్చిపోలేనిది.

    Bharath ane nenu an upcoming Indian film directed by Koratala Siva

    నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ...
    డివివి బ్యానర్ లో ఎంత మంచి సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను. డైరెక్టర్ కొరటాల శివ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. సినిమా విడుదల కాకముందే చాలా మంది కాల్ చేసి అడ్వాన్సు కంగ్రాట్స్ చెబుతుంటే ఆనందంగా ఉంది. ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నందుకు ఆనందం మాటల్లో చెప్పలేను. మహేష్ బాబుతో సినిమా తియ్యలన్న కోరిక ఈ సినిమాతో తీరింది.

    Bharath ane nenu an upcoming Indian film directed by Koratala Siva

    దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ..
    మీడియా వాళ్ళు ఈ సినిమాను మొదటినుండి ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్, సాంగ్స్ బాగున్నాయని వాళ్ళు చెప్పడం నిజంగా ఆనందమేసింది. సినిమా విడుదల తేది ముందుకు రావడంతో టీం అందరు కస్టపడి పనిచేసారు. అందరికి నా కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ సినిమా కథ నచ్చి మహేష్ బాబు నన్ను బాగా సపోర్ట్ చేసారు. కథ వినగానే చేద్దాం అన్నారు, అందుకు ఆయనకు స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాకు స్పెషల్ గా పాటల విషయంలో శ్రద్ద తీసుకోవడం జరిగింది. దేవి, రామజోగయ్య శాస్త్రి కి థాంక్స్ చెప్పుకోవాలి. రవికె చంద్రన్, తిరు దగ్గర చాలా నేర్చుకున్నాను. వాళ్ళ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. హీరోయిన్ హిందీ సినిమాలో బిజీగా ఉండడంతో ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయింది. నిర్మాత డివివి దానయ్య నన్ను నమ్మి ఈ సినిమా తీసారు. భవిషత్తులో ఆయన చరిత్ర తిరగరాయబోయే సినిమా చేస్తున్నారు ఆయన.

    English summary
    Bharath ane nenu an upcoming Indian film directed by Koratala Siva, featuring Mahesh Babu and Kiara Advani in the lead roles. It is set to releasing tomorrow, director talks about the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X