సీఎం అనగానే టెన్షన్, ఆ విషయంలో సిగ్గేసింది: మహేష్ బాబు ఇంటర్వ్యూ

By Bojja Kumar

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' మూవీ గ్రాండ్ రిలీజ్‌కు సిద్దమైంది. మహేష్ బాబు గత సినిమాలు దేనికీ లేనంతగా ఈ చిత్రానికి ప్రీరిలీజ్ బజ్ భారీగా ఉంది. టాలీవుడ్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్టవుతుందనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. ఇక సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్మాతలు మహేష్ బాబు స్పెషల్ ఇంటర్వ్యూ విడుదల చేశారు. ఈ సందర్భగా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

 సీఎం అనగానే టెన్షన్ అనిపించింది

సీఎం అనగానే టెన్షన్ అనిపించింది

శివగారు నాకు కథ చెప్పినపుడు...సీఎం పాత్ర అనగానే కాస్త టెన్షన్ అనిపించింది. ఎందుకంటే పాలిటిక్స్‌తో నాకు సంబంధం లేదు. నాకు అది పూర్తిగా భిన్నమైన ప్రపంచం. 10 నిమిషాలు నేరేషన్ తర్వాత ఎగ్జైటింగ్ అనిపించింది.... అని మహేష్ బాబు తెలిపారు.

నా బ్రదర్ ఇన్ లా జై ఒక రెఫరెన్స్

నా బ్రదర్ ఇన్ లా జై ఒక రెఫరెన్స్

నా బ్రదర్ ఇన్ లా జై అంటే చాలా ఇష్టం. నేను చేస్తున్న పొలిటికల్ పాత్రకు ఆయన ఒక రెఫరెన్స్. జై అమెరికాలో చదువుకుని ఇక్కడికి వచ్చారు. దర్శకుడు శివగారు ఆయన పార్లమెంటులో మాట్లాడిన కొన్ని వీడియోలు కూడా చూపించారు. ‘మాడమ్ స్పీకర్' అనే పదం ఆయన నుండి తీసుకున్నదే. ఇలాంటివి చాలా ఇన్స్‌స్పిరేషన్స్ తీసుకున్నాం. భరత్ పాత్ర చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది... అని మహేష్ బాబు అన్నారు.

 శివ వాటిని త్యాగం చేయాల్సి వచ్చింది

శివ వాటిని త్యాగం చేయాల్సి వచ్చింది

బ్యాంకాక్‌లో ఓ హెల్త్ రిసార్టులో కూర్చున్నపుడు మొత్తం 5 గంటలు నేరేషన్ చెప్పారు. ఇదంతా 3 గంటల్లో ఎలా తీస్తారు? అని అడిగాను. మేమంతా సినిమా చూసిన తర్వాత పార్ట్ 2 తీస్తే ఇంకా బావుండేది అనిపించింది. చాలా ఎగ్జైటింగ్ సీన్లు, సీక్వెన్స్ లు ఉన్నాయి. ఇది నా ఫేవరెట్ స్క్రిప్ట్. ఈ క్యారెక్టర్‌ను బాగా ఎంజాయ్ చేశాను. ఐదు గంటల కథను మూడు గంటలకు తీసుకురావడానికి చాలా సీన్లు శివ త్యాగం చేయాల్సి వచ్చింది.... అని మహేష్ బాబు తెలిపారు.

20 నిమిషాల సీన్ ఒకే షాట్లో తీశాం

20 నిమిషాల సీన్ ఒకే షాట్లో తీశాం

అసెంబ్లీ సెషన్స్‌కు సంబంధించిన 20 నిమిషాల నిడివి ఉన్న సీన్ కేవలం ఒకే షాట్ లో తీశాం. ఈ సీన్ కోసం అందరినీ డైలాగులు రిహార్సల్ చేయించాం. టైమింగ్ దెబ్బ తేడా రాకుండా చేశాం.... అని దర్శకుడు కొరటాల తెలిపారు.

 నిజంగా అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయో అలా చేశాం

నిజంగా అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయో అలా చేశాం

నిజంగా అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయో అలా చేశాం. నాకు మొదటి నుండి తెలుగు రాయడం, చదవడం రాదు. అసెంబ్లీ సీన్లలో చెప్పే కొన్ని డైలాగులు కొత్తగా అనిపించాయి. ఎప్పుడూ వినలేదు అనిపించాయి. అసెంబ్లీ సీన్స్ బాగా వచ్చాయి అని మహేష్ బాబు తెలిపారు.

రాజకీయాలపై ఆసక్తి పెరిగింది

రాజకీయాలపై ఆసక్తి పెరిగింది

పాలిటిక్స్ అంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు. కానీ ఈ సినిమా చేసిన తర్వాత ఆసక్తి పెరిగింది. ఈ సినిమా కోసం పెద్దగా ఎక్సర్‌సైజ్ చేయలేదు. కొరటాల శివ అంతా చూసుకొన్నారు. అలాంటి క్యారెక్టర్ చేయడం పెద్ద బాధ్యత, గౌరవం కూడా. ఈ జర్నీలో చాలా నేర్చుకొన్నాను. రాజకీయాలపై ఓ అవగాహన వచ్చింది. ఈ సినిమా చేయడం అరుదైన అవకాశం.... అని మహేష్ బాబు తెలిపారు.

 ఇంతగా ప్రీ రిలీజ్ బజ్ రాలేదు ఎప్పుడూ

ఇంతగా ప్రీ రిలీజ్ బజ్ రాలేదు ఎప్పుడూ

నా కెరీర్లో ప్రీ రిలీజ్ బజ్ ఇంతగా ఎప్పుడూ లేదు. ఈ సినిమాకు మాత్రమే వచ్చింది. కాంబినేషన్, కంటెంట్ ఇవన్నీ కూడా దీనికి దోహదం చేశాయి.... అని మహేష్ బాబు తెలిపారు.

 అపుడు కాస్త సిగ్గేసింది

అపుడు కాస్త సిగ్గేసింది

పంచె కట్టుకోడానికి చాలా సిగ్గు పడ్డాను. అది నాకు పెద్దగా అలవాటుల లేదు. అందుకే అందరి ముందు దాన్ని కట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్లాలి అంటే మొదట కాస్త ఇబ్బంది అనిపించింది. కానీ ఆ కాస్టూమ్ పవర్ ఏమిటో తర్వాత తెలిసింది అని మహేష్ బాబు తెలిపారు.

 అందుకే వారికి ఐఫోన్ గిఫ్టుగా ఇచ్చాను

అందుకే వారికి ఐఫోన్ గిఫ్టుగా ఇచ్చాను

ఈ సినిమాకు పని చేసిన కొరటాల టీమ్ చాలా నచ్చింది. వారి పని తీరు బావుంది. అందుకే వారికి ఐఫోన్లు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది.... అని మహేష్ బాబు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X