భరత్ బహిరంగ సభ: థియేట్రికల్ ట్రైలర్.. మాట మీద నిలబడే మగాళ్లని చేస్తానని ప్రమాణం చేస్తున్నా!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 న ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది. కాగా నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భరత్ బహిరంగ సభతో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తాజాగా ఎన్టీఆర్ భరత్ అనే నేను చిత్ర థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు.

ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. మహేష్ నటన, కొరటాల శివ రాసిన రాజకీయ పరమైన డైలాగులు ఈ చిత్రానికి ప్రధాన బలంగా కనిపిస్తోంది.ట్రైలర్ లో చూపిన ప్రతి షాట్ లో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా కనిపించారు. ప్రజల పట్ల ఎందుకు ఇంత హార్ష్ గా ఉన్నారంటూ మీడియా మహేష్ ని ప్రశ్నించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు కూడా బలంగా ఉన్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. రాజకీయ నాయకుల ఎత్తుగడలు, వాటిని మహేష్ అధికమించే విధానం చిత్రంలో ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఎట్టకేలకు ఒక్కడు వచ్చాడు.. రాజకీయ నాయకుడు అనుకున్నా.. నాయకుడు అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తున్న డైలాగ్ లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. హీరోయిన్ కైరా అద్వానిని ఈ ట్రైలర్ లో కేవలం రెండు మూడు షాట్స్ లోనే చూపించారు. అయినా కైరా చాలా అందంగా ఉంటూ తెలుగు యువతకు చేరువకావడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్ చివర్లో.. 'త్వరలోనే మీ అందరిని మాట మీద నిలబడే మగాళ్లని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా' అంటూ మహేష్ చెప్పే డైలాగ్ అదిరిపోయే విధంగా ఉంది. మొత్తంగా ఈ ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచుతుంది అనడంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X