కొరటాల శివ సీరియస్: మహేష్ బాబు చుట్టూ భారీ భద్రత!
మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘భరత్ అను నేను’ సినిమాకు సెట్స్‌లో భద్రత పెంచారు.ఈ సినిమాలో నుండి కొన్ని ఫోటోస్ లీక్ కావడంతో దర్శకుడు కొరటాల శివ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మహేష్ బాబు హీరోగా కొరాటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం 'భరత్ అను నేను' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'శ్రీమంతుడు' లాంటి భారీ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజిలో ఉన్నాయి.
'మిర్చి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ ఆ తర్వాత 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' సినిమాలతో వరుస విజయాలు అందుకుని హాట్రిక్ కొట్టాడు. ఇప్పటి వరకు ఫెయిల్యూర్ అంటే తెలియని కొరటాల శివ 'భరత్ అను నేను' తో మరో హిట్ కొడతారని అంతా నమ్మకంతో ఉన్నారు. అయితే 'భరత్ అను నేను' షూటింగ్ అంతా సాఫీగానే సాగుతున్నా.... లీకుల వ్యవహారం కొరటాలను ఇరిటేట్ చేస్తోంది

ఇప్పటికే కొన్ని ఫోటోస్ లీక్
‘భరత్ అను నేను' సినిమాలో మహేష్ బాబు సీఎంగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని ఫోటోస్ ఇప్పటికే లీక్ అయ్యాయి. ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్న కొరటాల శివ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.

మళ్లీ అలా జరుగడానికి వీల్లేదు
మళ్లీ సినిమా సెట్స్ నుండి మహేష్ బాబుకు సంబంధించిన ఫోటోస్ లీక్ కావడానికి వీల్లేదంటూ కాస్త సీరియస్‌గా ఉన్న కొరటాల... సెట్స్ లో భద్రత పెంచాడని, ఎలాంటి ఫోటోస్ తీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్
మహేష్ బాబు ఈ చిత్రంలో సీఎంగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేసి కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

భరత్ అను నేను
ఈ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్ గా కైరా అద్వాని నటిస్తోంది. ప్రకాష్‌రాజ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్, నిర్మాత: డి.వి.వి.దానయ్య, దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











