తెలుగు టీవీ యాంకర్ కి అసభ్య SMSలు..అరెస్ట్

By Srikanya

హైదరాబాద్ : స్దానిక ఎల్ బి నగర్ పోలీస్ లు ప్రముఖ టీవీ ఛానెల్ కి చెందిన ఓ యాంకర్ ని హెరాస్ చేస్తున్నారంటూ ఓ వ్యక్తిని అరెస్టు చేసారు. ఆమెకు అసభ్యకరమైన ఎస్ ఎమ్ ఎస్ లు పంపుతున్నారని అభియోగం. బి టెక్ పూర్తి చేసిన డిచ్చిపల్లి భరత్..కొత్తపేట మోహన్ నగర్ లో ఉంటున్నారు. అతను నల్గొండలోని లింగాల గ్రామానికి చెందన యువకుడు.

భరత్ తన కు పరిచయమున్నవారి ద్వారా ఆ యాంకర్ పర్శనల్ సెల్ నంబర్ సంపాదించి అసభ్య మెసేజ్ లు పంపటం మొదలు పెట్టారు. జూన్ 15 న ఆమె ఇలాంటి ఎస్ ఎమ్ ఎస్ లు కంటిన్యూ గా రావటం గమనించి పోలీస్ కంప్లైట్ చేసింది. పోలీస్ లు ఆ ఎస్ ఎమ్ ఎస్ లో ని నెంబర్ ఆధారంగా ఎక్వైరీ మొదలెట్టారు. అతన్ని అతని ఇంట్లోనే అరెస్టు చేసారు. ప్రస్తుతం అతన్ని జ్యూడిషయల్ కష్టడీకి పంపారు.

Bharath Arrested for sending SMS's to TV Anchor

కొద్ది రోజుల క్రితమే...ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సహ జీవనం చేస్తూ చివరకు మోసం చేసి వేరొక పెళ్లికి సిద్ధమవుతున్నాడంటూ ప్రియుడి పైన ఓ టీవీ యాంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాలు సమీపంలో నివసించే టీవీ యాంకర్ అనుశ్రీ, అర్జున్ గత అయిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కలిసి ఒకేచోట ఉండేవారు. పెళ్లి చేసుకుంటానని చెప్పిన అర్జున్ ఇటీవల కనిపించకుండా పోయాడు. విశాఖలో మరో యువతిని అర్జున్ శనివారం పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గురువారం రాత్రి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్ట్ చేసారు.

ఇక నాలుగు రోజుల క్రితమే డిల్లీలోని ఓ టీవీ ఛానల్ న్యూస్ యాంకర్ ఆత్మహత్యాయత్నం చేసుకునే ప్రయత్నం చేసింది. ఆత్మహత్యాయత్నం చేసిన టీవీ యాంకర్ వయస్సు 24. ఈమె ఛానల్ ప్రధాన ద్వారం వద్ద విషం తాగింది. ఈ ఘటన నోయిడాలో జరిగింది. ఆమెను నోయిడాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. నోయిడా పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను ఆదివారం సాయంత్రం రికార్డ్ చేశారు. కేసు నమోదు చేశారు. ఛానల్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X