పెళ్లిపీటలు ఎక్కుతున్న 'ప్రేమిస్తే' భరత్‌

By Srikanya

 Bharath goodbye to bachelorhood
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో 'బాయ్స్‌' ద్వారా తెరంగేట్రం చేసి, 'ప్రేమిస్తే'తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో భరత్‌. తెలుగు, తమిళంలో 23కు పైగా సినిమాల్లో నటించిన భరత్‌ త్వరలో ఇంటివాడు కాబోతున్నాడు. దుబాయ్‌కి చెందిన జోస్వా-జెస్సీ దంపతుల కుమార్తె డాక్టర్‌ జెస్లీని వివాహం చేసుకోనున్నారు.

ఈ విషయమై భరత్‌ మాట్లాడుతూ.. జెస్లీతో స్నేహం ప్రేమగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. అందుకే పెళ్లిపీటలు ఎక్కుతున్నాం. నా తల్లిదండ్రులు (శ్రీనివాసన్‌, భాగ్యలక్ష్మి) సమ్మతితోనే పెళ్లి చేసుకుంటున్నా. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంటాం. వివాహానంతరం సెప్టెంబరు 14న పెళ్లి విందు చెన్నైలో ఉంటుందని చెప్పారు.

ఇక చెన్నై సినిమా స్టూడియో తమిళంలో నిర్మించిన చిత్రం '555'. భరత్ హీరో. శశి దర్శకత్వం వహించారు. మిర్తిక, ఎరికా ఫెర్నాండజ్ హీరోయిన్స్. సంతానం కీలక పాత్రధారి. ఈ సినిమా కోసం భరత్ సిక్స్‌ప్యాక్ చేశారు. ఈ చిత్రానికి ఎం.ఆశిష్ సమర్పకుడు. సురభి ఫిలిమ్స్ తెలుగులో నిర్మిస్తోంది.


దర్శకుడు శశి మాట్లాడుతూ- 2010 నుండి ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు సాగుతున్నాయని, 2011నుండి షూటింగ్ ప్రారంభించామని తెలిపారు. భరత్ ఈ చిత్రం కోసం సిక్స్ ప్యాక్‌ను సాధించాడని, ఏడు పాటలతో ఇప్పటికే విడుదలైన ఆడియో ప్రజాదరణ పొందుతోందని తెలిపారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో సైకాలజీ, మైండ్ గేమ్ ప్రధానాంశంగా సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నామని, 555 అంటే ఏమిటో తెలియాలంటే చిత్రం చూడాలని ఆయన వివరించారు.

మిర్తిక, ఎరికా ఫెర్నాండెజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సంతానం, సురేష్ బెర్రి, జాన్ విజయ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:సీమోన్, కెమెరా:శరవణన్ అభిమన్యు, ఎడిటింగ్:సుభరఖ్, నిర్మాణం:చెన్నై సినిమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శశి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X