హీరో భరత్, జెస్సీ వెడ్డింగ్ రిసెప్షన్ (ఫోటోలు)
చెన్నై: 'ప్రేమిస్తే' సినిమా హీరో భరత్ జెస్పీ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9న వీరి వివాహం చైన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో బంధువులు, సన్నిహితుల సమక్షంలో ప్రైవేటు కార్యకమంలా జరిగింది. కాగా సెప్టెంబర్ 14న చెన్నైలోని లీలా మహల్‌లో వీరి వివాహ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది.
పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు వీరి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన వధూ వరులను ఆశీర్వదించారు. హీరో సూర్య, ప్రముఖ నటుడు సత్యరాజ్, అర్జున్, మణిరత్నం, సుహాసిని, త్యాగరాజన్, కె. బాల చందర్, హీరో శింబు, టి రాజేందర్ తదితరులు హాజరయ్యారు.
తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భరత్, క్రైస్తవ మతస్తురాలైన జెస్సీని పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకోవడం గమనార్హం. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా భరత్, జెస్సీ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. జెస్సీ దుబాయ్‌లో దంతవైద్యురాలు.
2004లో ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్' చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించిన భరత్....ప్రేమిస్తే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించాడు. స్లైడ్ షోలో భరత్-జెస్సీలకు సంబంధించిన వెడ్డింగ్ రిసెప్సన్ ఫోటోలు, వివరాలు...

ఎంకె స్టాలిన్
తమిళ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ తండ్రి, డిఎంకె పార్టీ లీడర్ ఎంకె.స్టాలిన్ భరత్-జెస్సీల వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

హరి, ప్రీతి
తమిళ దర్శకుడు హరి తన భార్య ప్రీతితో కలిసి భరత్-జెస్సీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరయ్యారు. హరి, భరత్ కాంబినేషన్లో 2008లో ‘సెవల్'అనే తమిళ సినిమా వచ్చింది.

శింబు
తమిళ స్టార్ హీరో శింబు కూడా భరత్-జెస్సీ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. శింబు గత కొంత కాలంగా హీరోయిన్ హన్సికతో డేటింగ్ చేస్తున్నారు. త్వరలో వీరు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇద్దరూ ఒప్పుకున్నారు కూడా.

టి రాజేందర్, శింబు
తమిళ స్టార్ హీరో శింబుతో పాటు, శింబు తండ్రి టి. రాజేందర్ కూడా భరత్-జెస్సీ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్బంగా ఆయన నూతన వదూవరులను ఆశీర్వదించారు.

కె బాలచందర్
తమిళ సినీ పరిశ్రమలో ఎంతో మంది గొప్ప నటీనటులుక గురువు లాంటి వారు ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్. ఆయన భరత్-జెస్సీ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హజరయ్యారు.

. త్యాగరాజన్
చాలా రేర్‌గా పబ్లిక్ ఫంక్షన్లలో కనిపించే తమిళ దర్శకుడు త్యాగరాజన్ భరత్-జెస్సీ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అర్జున్
ప్రముఖ నటుడు అర్జున్ తన భార్యతో కలిసి భరత్-జెస్సీ వెడ్డింగ్ రిసెప్సన్ కార్యక్రమానికి హాజరయ్యాడు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

మణిరత్నం, సుహాసిని
ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం, ఆయన భార్య, నటి సుహాసిని భరత్-జెస్సీ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యాడు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

సూర్య
తమిళ స్టార్ హీరో సూర్య కూడా అర్జున్-జెస్సీ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. సూర్య, భరత్ చాలా సన్నిహిత స్నేహితులు.

అర్జున్, ఆశారాణి
ఇక్కడున్న ఫోటోలో అర్జున్ తన భార్య ఆశారాణితో కలిసి భరత్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరవుతున్న దృశ్యాన్ని చూడొచ్చు.

భరత్-జెస్సీ ఫ్రెండ్షిప్
తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భరత్, క్రైస్తవ మతస్తురాలైన జెస్సీని పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకోవడం గమనార్హం. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా భరత్, జెస్సీ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. జెస్సీ దుబాయ్‌లో దంతవైద్యురాలు.

భరత్ బాలీవుడ్ ఎంట్రీ
భరత్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘జాక్ పాట్' అనే తమిళ చిత్రంలో ఆయన మాజీ ఫోర్న్ స్టార్ సన్నీలియోన్‌తో కలిసి నటించబోతున్నారు. ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, సచిన్ జోషిలు కూడా నటిస్తున్నారు.

భతర్ 555
భరత్ చివరి సారిగా 555 అనే తమిళ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకులు ప్రశంసలు దక్కాయి. సినిమా మంచి విజయం సాధించింది.

భరత్, జెస్సీలకు స్పెషల్ డే
సెప్టెంబర్ 9న వీరి వివాహం చైన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో బంధువులు, సన్నిహితుల సమక్షంలో ప్రైవేటు కార్యకమంలా జరిగింది. కాగా సెప్టెంబర్ 14న చెన్నైలోని లీలా మహల్‌లో వీరి వివాహ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది.


Click it and Unblock the Notifications











