పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నా: హైకోర్టులో కమల్ హాసన్ పిటిష‌న్

లోకనాయకుడు కమల్ హాసన్ హైకోర్టులో పిటిష‌న్ దాఖలు చేయడం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల వేధింపులు అంటూ తన గోడు వెలిబుచ్చుతూ కమల్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. మరి కమల్ హాసన్ హైకోర్టు ఎందుకు వెల్లవలసి వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దామా..

భారతీయుడు 2.. ఘోర ప్రమాదం

భారతీయుడు 2.. ఘోర ప్రమాదం

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్ జరుగుతుండగా భారీ క్రేన్ విరిగిపడటంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో పదికి గాయాలయ్యాయి. డైరెక్టర్ శంకర్ కూడా గాయపడ్డారు. ఈ ఘటనతో తమిళ సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.

చెన్నైలో షూటింగ్.. కేసు నమోదు చేసిన పోలీసులు

చెన్నైలో షూటింగ్.. కేసు నమోదు చేసిన పోలీసులు

చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కృష్ణ (34), మరో సహాయకుడు చంద్రన్ మృతి చెందారు. మరో పది మంది యూనిట్ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

సీబీసీఐడీ విచార‌ణ.. హైకోర్టును ఆశ్రయించిన కమల్

సీబీసీఐడీ విచార‌ణ.. హైకోర్టును ఆశ్రయించిన కమల్

ఈ ఘ‌ట‌న‌పై సీబీసీఐడీ విచార‌ణ సాగుతుంది. ఈ విచార‌ణ‌లో భాగంగా డైరెక్టర్ శంకర్, హీరోహీరోయిన్లు కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ లను విచారిస్తున్నారు చెన్నై పోలీసులు. గత కొన్నిరోజులుగా ఆ విచారణ జరుగుతోంది. అయితే తాజాగా ఈ విషయమై కమల్ హాసన్ హైకోర్టును ఆశ్రయించడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

పోలీసులు వేధిస్తున్నారు

పోలీసులు వేధిస్తున్నారు

విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారంటూ క‌మ‌ల్‌హాస‌న్ మ‌ద్రాస్ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. అత్య‌వ‌స‌ర విచార‌ణ‌కు పిటిష‌న్‌ను హైకోర్టు స్వీక‌రించింది. దీంతో మరోసారి ఈ అంశం వార్తల్లో నిలిచింది. షూటింగ్‌లో ఈ ప్రమాదం జరిగిందని తెలియగానే కమల్ కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Recommended Video

Director Shankar Responds On Indian 2 Crane Mishap
భారతీయుడు- 2 మూవీ

భారతీయుడు- 2 మూవీ

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 మూవీ రూపొందుతోంది. చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో 85 ఏళ్ల ముసలమ్మ పాత్రలో కాజల్ నటిస్తుండటం విశేషం. తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X