అంజలి వెనక ఎవరో ఉన్నారు : భారతీదేవి

By Bojja Kumar

హైదరాబాద్ : తన డబ్బు మింగేశారని, తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, తనను హింసిస్తున్నారని హీరోయిన్ అంజలి చేసిన వ్యాఖ్యలపై ఆమె పిన్ని భారతీ దేవి స్పందించారు. అంజలి చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆమె వెనక ఎవరో ఉండి ఇవన్నీ చేయిస్తున్నారని అనుమానం వ్యక్తం చేసారు.

అంజలి తన సోదరి కూతురని, 15 ఏళ్ల వయసులోనే ఆమెను దత్తత తీసుకున్నానని, కన్నబిడ్డలా పెంచానని, ఆమె హీరోయిన్‌‌గా ఎదగడానికి అన్ని విధాలా శ్రమించానని భారతీ దేవి వెల్లడించారు. అంజలి తల్లి ప్రస్తుతం గల్ఫ్ లో ఉంటుందని వెల్లడించారు. షాపింగ్ మాల్ సినిమా తర్వాత ఆమెకు స్టార్ డమ్ రావడంతో ఆమె ప్రవర్తన మారిపోయిందని తెలిపాురు. అంజలి ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమిటో తనకు తెలియదని తెలిపారు. ఎవరో ఆమె ఆదాయంపై కన్నేసి ఇలాంటివి చేస్తున్నారని ఆరోపించారు.

అంజలికి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయన్న వార్తలో నిజం లేదని, ఆమె రెమ్యూనరేషన్ లక్షల్లో ఉంటే కోట్ల ఆస్తులు ఎలా వస్తాయని భారతీదేవి ప్రశ్నించారు. అంజలిని తానేమీ తప్పుడు పనులు చేయమని పురమాయించలేదన్నారు. అంజలి ప్రస్తుతం ఎక్కడ ఉందో తెలియదని, ఆమె కోసం ప్రయత్నిస్తే ఫోన్ స్విచాఫ్ వస్తోందని తెలిపారు. తను ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు భారతీదేవి తెలిపారు.

మరో వైపు అంజలి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ....ప్రస్తుతం తమకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, మా పిన్ని భారతీదేవి మొదటి నుంచి బాగానే ఉండేదని, ప్రస్తుతం అంజలి తమకు కూడా అందుబాటులో లేదని, అంజలిని కలిసి అన్ని వివరాలు తెలిసుకుంటామని తెలిపారు. ఆమె మరో సోదరుడు శంకర్ అంజలి అదృశ్యం కావడంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.

కాగా....ఎవరికీ కనపడకుండా అదృశ్యమైన అంజలి ఈ రోజు సాయంత్రం, లేదా రేపు ఉదయం వరకు బయటకు బచ్చే అవకాశం ఉందని, ఆమె రేపు బెంగుళూరులో జరుగుతున్న బోల్ బచ్చన్ తెలుగు రీమేక్ సినిమా షూటింగులో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రంలో అంజలి ముఖ్య పాత్ర పోషిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X