అందుకే రజనీకాంత్‌తో విభేదించాను.. భారతీరాజా సెన్సేషనల్ కామెంట్స్
రాజకీయంగా వెనుకడుగు వేస్తున్నట్టు రజనీకాంత్ చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొందరు మాత్రం రజనీకాంత్ మంచి నిర్ణయం తీసుకున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోయారు. రజనీ నిర్ణయంపై సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం సుముఖత వ్యక్తం చేసింది. రజనీ ఆరోగ్యమే తమకు ముఖ్యమైన సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా భారతీ రాజా కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు.

ఆరోగ్యం సహకరించకపోవడంతో..
రజనీకాంత్ ఆరోగ్యం సహకరించకపోవడంతో అన్నాత్తె షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని చెబుతూ.. తన వల్ల, ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ఎంతో మందికి పని లేకుండా పోయింది.. నిర్మాతలకు నష్టం వచ్చిందని రజనీ ఎమోషనల్ అయ్యాడు. ఇది దేవుడి హెచ్చరికలా అనిపించింది.. నా వల్ల మిగతా వారంతా సమస్యలు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు.. అందుకే నేను పార్టీ పెట్టడం లేదు.. రాజకీయాల్లోకి రావడం లేదు..అంటూ రజనీ పేర్కొన్నాడు.

సెలెబ్రిటీల మద్దతు..
రజనీకాంత్ నిర్ణయంపై కుష్బూ, లారెన్స్, కార్తీక్ సుబ్బరాజు వంటివారు హర్షం వ్యక్తం చేశారు. రజనీ తీసుకున్న నిర్ణయం వంద శాతం సమర్థనీయమని పేర్కొన్నారు. తమకు రజనీ ఆరోగ్యమే ఎంతో ముఖ్యమని ట్వీట్లు చేశారు. తాజాగా భారతీ రాజా సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

గతంలో అలా..
రజనీ కాంత్ రాజకీయ ప్రకటనపై ఆ మధ్య భారతీరాజా విభేదించాడు. సినిమా నటులకు భాష, ప్రాంతాలతో సంబంధం లేదు, కానీ రాజకీయాలకు ప్రాంతీయత తప్పకుండ కావాలంటూ రజనీ రాజకీయ ఎంట్రీపై భారతీరాజా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అయితే తాజాగా రజనీ రాజకీయాలకు నో చెప్పడంపైనా స్పందించాడు.

అందుకే విభేదించాను...
రాజకీయాలకు ప్రాంతీయత తప్పకుండ కావాలి.. అందుకే నేను రజినీకాంత్‌తో విభేదించాను.. తమిళనాడులో తమిళులే సీఎంగా ఉండాలి.. రజినీకాంత్ రాజకీయాలకు రాకపోవడం అతని ఆరోగ్య రీత్యా మంచిది. అయినా అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రజినీ సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు ఇంకెవరు సంపాదించలేరని భారతీ రాజా పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











