బాలయ్య భారీ కానుక

By Staff

Balakrishna
తను పర్శనల్ గా ఇష్టపడితే వారికి ఏం సాయం చేయటానికైనా వెనుకాడని వ్యక్తి గా బాలకృష్ణ కు పేరుంది. దాన్ని నిరూపించే సంఘటన తాజాగా భారవి విషయంలో జరిగింది. బాలకృష్ణ కథానాయకుడిగా కె రాఘవేంద్రరావు రూపొందించిన 'పాండురంగడు' సినిమాకి భారవి కథ, మాటలు అందించారు. కథలో ఆయన కల్పించిన సన్నివేశాలు, సంభాషణలు బాలయ్యని బాగా మెప్పించాయి. దాంతో భారవికి ఆయన ఖరీదైన ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో ఒక ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చారని పరిశ్రమ లో ప్రచారం జరుగుతోంది.

భారవిగా 'అన్నమయ్య', 'శ్రీ మంజునాథ', 'శ్రీరామదాసు' చిత్రాలకు స్క్రిప్టును సమకూర్చి, సంభాషణలు రాసి పాపులర్ అయ్యారు. భక్తిరస చిత్రాలు కు కేరాఫ్ ఎడ్రస్ రచయితగా మారారు. అంతేగాక ఆయన పనిచేసిన మిగతా సినిమాలు యేవి జనానికి పట్టలేదు. కొన్నాళ్ల క్రితం 'ఫ్యాన్స్' అనే సినిమాను డైరెక్ట్ చేశారు కానీ, అదీ విడుదలకు నోచుకోలేదు. దాంతో పూర్తిగా పురాణ సంబంధ చిత్రాలకే పరిమితం అయ్యారు. ఇప్పుడు పాండు రంగడు చిత్రం కూడా భక్త పుండరీకుడు కథ. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రలలో కనిపించనున్నారు. ఇప్పుడీ సంఘటనతో బాలయ్య చాలాకాలం తర్వాత సినిమా బాగా వచ్చిందని పూర్తి స్థాయి సంతృప్తి తో ఉన్నారని తెలుస్తోంది. దాంతో పాండు రంగడు విజయం గ్యారంటి అని అభిమానులు అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి కీరవాణి సమకూర్చిన పాటలు ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X