'అష్టాచెమ్మ' ప్రాణం తీసింది

By Staff

Bhargavi
నిన్న అనుమానస్పద పరిస్ధితుల్లో ప్రాణాలు వదిలిన భార్గవి మరణం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అష్టాచెమ్మా హిట్టవటంతో ఆమెకు వరస ఆఫర్స్ వస్తున్నాయని.. తనని పట్టించుకోవటం లేదన్నట్లుగా ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య లేఖలో రాయిటం అందరినీ ఆలోచింప చేస్తోంది. కొన్ని సంవత్సరాలుగా సినీ పరిశ్రమనే నమ్ముకొని ఉన్న భార్గవి నటిగా తెచ్చుకుంటున్న గుర్తింపే ఇప్పుడు ఆమె పాలిట శాపంగా మారిందని వ్యాఖ్యానించుకుంటున్నారు. మరికొందరు జూనియర్ ఆర్టిస్ట్ లు సైతం ఇదే విషయాన్ని కృష్ణానగర్ లో గుంపులు గుంపులుగా చేరి చర్చించుకోవటం జరిగింది. తమ చుట్టూతా తమకు తెలీయకుండానే అసూయ,ద్వేషాలతో అల్లుకునే విష వలయాలను తలుచుకుంటున్నారు.

ఇలాంటి ఘటనలకు అసూయే అసలు కారణమని పోలీసు అధికారులు సైతం చెబుతున్నారు. ముఖ్యంగా పేరు ప్రఖ్యాతలతోపాటు అదే స్థాయిలో అపార్థాలకూ నిలయమైన సినీ పరిశ్రమలో ఇవి ఇంకా ఎక్కువగా ఉంటాయని ఓ ఉన్నతాధికారి విశ్లేషించారు. సినీ పరిశ్రమలో నటీనటులు ఒకరికొకరు సన్నిహితంగా ఉండటం మామూలు విషయమని, ఇదే అనేక రకాల అపార్థాలకు తావిస్తోందని, అడపాదడపా ప్రాణాంతకంగా మారుతోందని ఆ అధికారి వివరించారు. అందుకే సినీ వ్యామోహంతో రాజధానికి చేరుకునే వారు ముఖ్యంగా యువతులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. సినిమాల బిజీలో స్నేహితుల్నీ.. బంధువుల్నీ పట్టించుకోకపోవడం అపార్థాలకు దారితీస్తోందని ఆయన అంటున్నారు.

ఈ సందర్భంగా ఇదే తరహాలో మరణించిన ప్రత్యూష లాంటి మరికొందరు పేర్లు సైతం ప్రస్తావనకు వస్తున్నాయి. వారిలో శోభ(మనవూరి పాండవులు); దివ్యభారతి (మృతి 1993 ఏప్రిల్‌ 5); సిల్క్‌స్మిత(మృతి 1996 సెప్టెంబరు 23); అలేఖ్య(పెళ్లిసందడిలో నటించింది.. మృతి 2007 ఆగస్టు 8); ఫటాఫట్‌ జయలక్ష్మి(అంతులేని కథ); కునాల్‌సింగ్‌(మృతి 2008 ఫిబ్రవరి 7); సునందిని(జగమే మాయ హీరోయిన్‌); లీలారాణి (బడిపంతులులో నటించింది). ఇదే కోవలో విజయశ్రీ, మధుమాలిని, ఆంచల్‌ లాంటి నటీమణులూ ఉన్నారు. టీవీ తారల్లో మొన్నటి ప్రత్యూష, నిన్నటి లక్ష్మీ సుజాత ఉన్నారు. ఇక ఆర్తి అగర్వాల్‌, ఉదయభానులలాగా చివరి క్షణాల్లో బతికి బయటపడినవారూ ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X