twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫేమస్ లిరిక్ రైటర్ భాస్కర భట్లకు అరుదైన గౌరవం.. వేటూరి పురస్కారం

    |

    తెలుగు సినీ పరిశ్రమలో పాపులర్ లిరిక్ రైటర్‌గా పేరు గాంచారు భాస్కరభట్ల రవికుమార్. చిన్న చిన్న మాటలతో మ్యాజిక్ చేస్తూ పదాలకే అలంకరణ తీసుకురావడం ఆయన ప్రత్యేకత. మనం మాట్లాడుకునే మాటలే ఆయన పాటల్లో వినిపిస్తుండటం చూడొచ్చు. సాధారణ పదాలనే ఒకదాని వెంట ఒకటి అమర్చి దాన్ని పాటగా మార్చడంలో సిద్ధహస్తుడు మన భాస్కరభట్ల రవికుమార్.

    ఆయన పాటల్లోని పదాల అర్థాలు తెలుసుకోవడానికి డిక్షనరీలు తిరగేయాల్సిన అవసరం అస్సలుండదు. మేధావులు మొదలుకొని నిరక్షరాస్యుల దాకా అందరూ అర్థం చేసుకునేలా చాలా సింపుల్‌గా ఆయన పాటలు ఉంటాయి. మెలోడి అయినా, మాస్ మసాలా పాటైనా భాస్కరభట్ల శైలి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిత్యం నోట్లో నానే పదాలతోనే మ్యాజిక్ చేసే ఆయన పాటల గారడీకి తాజాగా మాంచి గుర్తింపు లభించింది. ఇటీవలే గద్దలకొండ గణేష్ సినిమాలో ఓ ఊపు ఊపేసిన 'జర్ర జర్ర' సాంగ్ రాసింది కూడా భాస్కరభట్లనే.

     Bhaskarabhatla Ravi Kumar selected for Veturi award

    ఇప్పటిదాకా 1000కి పైగానే పాటలు రాసిన భాస్కరభట్ల.. ఆత్రేయ స్మారక పీఠం వేటూరి పురస్కారం అందుకోబోతున్నారు. భాస్కరభట్ల టాలెంట్ గుర్తించి ఈ అవార్డును ఆయనకు ప్రధానం చేయబోతున్నామని కళా పీఠం అధ్యక్షులు చంద్రశేఖర్ రావు అన్నారు. విజయనగరంలో జనవరి 29న ఈ అవార్డు స్వీకరించనున్నారు భాస్కర భట్ల. రెండు దశాబ్దాలుగా సాహిత్య రంగానికి చేస్తున్న సేవలకు గాను భాస్కర భట్లకు ఈ అవార్డు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

    English summary
    Bhaskarabhatla Ravi Kumar is an Indian lyricist predominately works in Telugu cinema. He worked for more than 125 films. Now He selected for Veturi award.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X