నితిన్ నా గదిలో ఉంటే తప్పేంటి?
ఒకే రూమ్ లో కలిసి ఉంటే ఏదో జరిగిపోయినట్లేనా..అందులో తప్పేమీ నాకు కనపడటం లేదు..అంటోంది భావన. నితిన్ మీరూ ఒకే హోటల్ రూమ్ షేర్ చేసుకున్నారు కదా అని తమిళ మీడియా ఆమెను నిలదీస్తే ఆమె వెంటనే ఈ సమాధాన మిచ్చింది. గత కొంత కాలంగా నితిన్, భావన మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు అంతటా వార్తలు వస్తున్నాయి. అయితే ఇద్దరూ దాన్ని ఖండిస్తూ వస్తున్నారు.
అందులోనూ ఆ మధ్య హీరో సినిమాలో చేసినప్పుడూ మరీ దగ్గరయ్యారని, ఆమె తల్లితండ్రులు దీనిపై సీరియస్ అయ్యారని వినపడింది. అయితే ముందుకెళ్తున్న కెరీర్ దృష్ట్యా దీన్ని పెద్ద ఇష్యూ చేయలేదు. కానీ ఇప్పుడు ఇద్దరూ ఒకే హోటల్ రూమ్ లో ఉండటం మాత్రం అంతటా వార్త గా మారింది. అలాగే నితిన్ పేరెంట్స్ కూడా ఈ తరహా ప్రేమ వ్యవహారాలు ఇష్టపడటం లేదని ఫిల్మ సర్కిల్స్ లో వినపడుతోంది. ఏం జరగనుందో కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం నితిన్ వర్మ దర్శకత్వంలో అజ్ఞాత్ చిత్రంలోనూ, పరుచూరి మురళి మిర్చి చిత్రంలోనూ నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











