షూటింగ్ లో ప్రమాదానికి గురైన భావన!
తెలుగులో శ్రీకాంత్ లో మహాత్మ చిత్రంలో నటించి అందరి ప్రశంసలు అందుకొన్న మలయాళ భామ భావన ప్రస్తుతం కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ తో 'జాకీ" అనే ఒక కన్నడ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగులో ప్రమాదానికి గురైంది. ఆ చిత్ర దర్శకుడు సూరి, భావన మీద ఒక చిలిపి సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీన్ ప్రకారం బైక్ మీద వెళ్తున్న భావన, తన పక్కనుండి చెరుకు గడల లోడ్ వేసుకుని వెళ్తున్న లారీలో నుండి ఒక చెరుకు గడను లాగే సన్నివేసం అది. మూడో టేక్ దాకా అంతా సవ్యంగానే సాగింది. కానీ మూడో టేకులోనే, భావన సరిగ్గ చెరకు గడను లాగే సమయానికి లారీ కొంచెం వేగం అందుకోవడంతో, బైకు బ్యాలన్స్ తప్పడంతో భావన బైకు మీద నుండి కిందపడిపోయింది. దాంతో లారీ ఆమెను కొద్ది దూరం వరకు లాక్కుని వెళ్ళింది.
ఈ ప్రమాదంలో ఎడమ కాలుకు కొద్ది పాటి గాయాలు అయిన భావనను డాక్టర్లు పరీక్షించి కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అంత పెద్ద ప్రమాదం నుండి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ భావన, దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్కువగా పెద్ద దెబ్బలేవీ తగలకుండా తనను కాపాడడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











