Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నిర్మాతతో హీరోయిన్ భావన వివాహం... డేట్ ఫిక్స్ అయింది!
ప్రముఖ మళయాలం హీరోయిన్ భావన నిశ్చితార్థం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. కన్నడ నిర్మాత నవీన్ తో కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న భావన అతడినే పెళ్లాడాలని నిర్ణయించుకుంది. అక్టోబర్ 2017లో వీరి వివాహం జరుగబోత
హైదరాబాద్: ప్రముఖ మళయాలం హీరోయిన్ భావన నిశ్చితార్థం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. కన్నడ నిర్మాత నవీన్ తో కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న భావన అతడినే పెళ్లాడాలని నిర్ణయించుకుంది. అక్టోబర్ 2017లో వీరి వివాహం జరుగబోతోంది.
ఇటీవల ఇంటర్వ్యూలో అక్టోబర్లో తమ వివాహం జరుగుతుందని భావన వెల్లడించారు. తాజాగా భావన తల్లి పుష్క వివాహ తేదీని ప్రకటించారు. అక్టోబర్ 27న భావన-నవీన్ పెళ్లి జరుగుతుందని తెలిపారు.
భావన సొంతూరులో వేడుక
భావన-నవీన్ పెళ్లి వేడుక భావన స్వస్థలమైన తిరుచ్చూరులో జరుగబోతోంది. ఇక్కడి లులు కన్వెన్షన్ సెంటర్ ను వివాహం కోసం బుక్ చేసారు.
సింపుల్ గా పెళ్లి
భావన-నవీన్ వివాహం చాలా సింపుల్ గా జరుగబోతోంది. ఈ వివాహ వేడుకకు కొద్ది మంది సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారు.
ఆ చీకటి సంఘటన నుండి ఇప్పుడప్పుడే
ఇటీవల భావనపై కేరళలో లైంగిక వేధింపులు, దాడి ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఆ సంగటన నుండి భావన ఇప్పుడిప్పుడే బయట పడుతోంది.
ధైర్యంగా ముందుకు
తనపై జరిగిన లైంగిక వేధింపులు, దాడి వెనక కుట్ర కోణం ఉందని, దాని వెనక ఉన్న వారికి శిక్ష పడే వరకు ధైర్యంగా పోరాడుతానని భావన స్పష్టం చేసింది.