గెలిచే వరకు పోరాడుతా : లైంగిక దాడి పై హీరోయిన్ భావన!

ఈ ఘటన కేవలం డబ్బు కోసమే చేసారని నేను భావించడం లేదు. కేవలం డ్రైవర్ కి ఇదంతా చేసే ధైర్యం ఉంటుందని నేను నమ్మడం లేదు. అలా అని ఈ ఘటన వెనుక నా శత్రువుల హస్తం ఉందని చెప్పడం లేదు.

By Bojja Kumar

హైదరాబాద్: మలయాళ హీరోయిన్ భావన జీవితంలో కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన సౌత్ సినీ పరిశ్రమ మొత్తాన్ని కదిలించింది. భావన మాజీ డ్రైవర్ మరికొందరితో కలిసి ఆమెను కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ అసభ్యంగా లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. భావనను అసభ్యంగా ఫోటోలు, వీడియోలు తీసిన డబ్బు డిమాండ్ చేసారు.

ఈ ఘటనపై భావన ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే భావనకు మళయాల సినీ పరిశ్రమలో శత్రువులు ఉండటంతో ఈ సంఘటన వెనక వారి హస్తం ఉందా? లేక కేవలం డబ్బు కోసమే ఇదంతా జరిగిందా? అనే అనుమానాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఈ పరిణామాలపై భావన స్పందించారు.

గెలిచే వరకు పోరాడతా

గెలిచే వరకు పోరాడతా

ఈ ఘటన కేవలం డబ్బు కోసమే చేసారని నేను భావించడం లేదు. కేవలం డ్రైవర్ కి ఇదంతా చేసే ధైర్యం ఉంటుందని నేను నమ్మడం లేదు. అలా అని ఈ ఘటన వెనుక నా శత్రువుల హస్తం ఉందని చెప్పడం లేదు. దీని వెనక ఎవరు ఉన్నారనే దానికి నాకు సమాధానం కావాలి. నేను గెలిచే వరకూ పోరాడతా అని భావన స్పష్టం చేసారు.

నేరం చేసినోళ్లే సిగ్గు పడాలి

నేరం చేసినోళ్లే సిగ్గు పడాలి

ఇలాంటి ఘటనలు ఎదురైనపుడు బయటపెట్టడానికి భయపడకూడదు. తప్పు చేసినోళ్లకు తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకూడదు. ఇలాంటివి ఎదురైతే మహిళలు సిగ్గు పడ కూడదు...నేరం చేసినోళ్లే సిగ్గు పడేలా చేయాలి అని భావన చెప్పుకొచ్చారు.

తప్పు చేశాననే బాధతో గడపాల్సి వచ్చేది

తప్పు చేశాననే బాధతో గడపాల్సి వచ్చేది

నేను ఈ ఘటనపై మౌనం వహించి ఉంటే నలుగురిలో దీని గురించి మాట్లాడలేదనే అపరాధ భావంతో తల ఎత్తుకోలేక పోయేదాన్ని. తప్పు చేశాననే బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చేది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసా, నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాను అని భావన ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.

నా వ్యవహార శైలి అంతే

నా వ్యవహార శైలి అంతే

సినీ పరిశ్రమలో నా శ్రతువుల గురించి కొందరు నాకు సలహాలు ఇస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.... అలాగే సినిమాల్లోనూ అంతే రాజీ పడాలని కోరుతున్నారు. కానీ పరిశ్రమలో నాకు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉన్నారు...నేను చేయని తప్పుకు ఎప్పటికీ రాజీపడను, క్షమాపణ చెప్పను అని భావన తెలిపారు.

More from Filmibeat

Read more about: bhavana భావన
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X