సైకో బారిన 'మహాత్మ' భావన

By Srikanya

హీరో, మహాత్మ చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన భావన ఆ తర్వాత తెలుగులో స్ట్రయిట్ చిత్రాల్లో నటించలేదన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పవడూ... అడపా దడపా ఆమె డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు తెరపై మెరుస్తోంది. తాజాగా ఆమె మలయాళంలో నటించిన వింటర్ అనే చిత్రం తెలుగులో విడుదల కానుంది. తన్మయి మూవీ మేకర్స్‌పై బీయన్. ప్రసాద్, జి.చెన్నారెడ్డి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డి. వెంకటసురేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో జయరాం భార్యగా భావన నటించింది. ఈ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో అద్దెకు ఉంటారు. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఓ సైకో చేసే అఘాయిత్యాలకు మనుషులతో పాటు జంతువులు కూడా బలవుతుంటాయి. ఆ సైకోవల్ల భావన కుటుంబం కూడా ఇబ్బందులపాలవుతుంది. ఆ సైకో ఎవరు? ఆ మారణహోమం ఎందుకు సృష్టిస్తున్నాడు? అనే మిస్టరీని ఛేదించి తన కుటుంబంతో పాటు ఇతరులను కూడా జయరాం ఎలా కాపాడాడు? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది. హారర్, సస్పెన్స్, యాక్షన్, సెంటిమెంట్ సమాహారంతో అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది. త్వరలో ఈ టైటిల్‌ని ప్రకటిస్తాం. వచ్చే నెలలో సినిమా విడుదల చేస్తాం** అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజాకృష్ణన్, మాటలు: వి.దుర్గాప్రసాద్, పాటలు: వి.విజయలక్ష్మి, దర్శకత్వం: దీపు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X