భావన ఇపుడు ఒంటరి కాదు
ఒంటరి సినిమాతో గోపీచంద్ సరసన హీరోయిన్ గా తెలుగులో మొదటిసారి చేస్తున్న తమిళ భావనకు రెండో సినిమా అవకాశం కూడా వెతుక్కుంటూ వచ్చింది. సూపర్ నిర్మాత ఎంఎస్ రాజు తన కుమారుడు సుమంత్ అశ్విన్ ను హీరోగా పరిచయం చేస్తున్న నువ్వే నా హీరో సినిమాకు భావనను అడిగారట. ఈ సినిమాకు తేజ దర్శకుడు. భావనతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో కనిపించనుంది. అయితే రెండో హీరోయిన్ ఎవరో ఇంకా తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











