»   »  సూపర్ గుడ్ సినిమాకు భావన

సూపర్ గుడ్ సినిమాకు భావన

Posted By:
Subscribe to Filmibeat Telugu
వాన సినిమాతో దర్శకుని అవతారం ఎత్తుతున్న నిర్మాత ఎంఎస్ రాజు. వాన సినిమా దాదాపు పూర్తి కావస్తోంది. ఈ సినిమా పూర్తవగానే తన కొడుకును హీరోగా చేసే పనిలో పడనున్నారు. తన కొడుకు సినిమాలో హీరోయిన్ ఎవరో ఇంకా తెలియనప్పటికీ తమిళ నటి భావన సూపర్ గుడ్ ఫిల్మ్స్ కోసం పనిచేయడానికి సంతకం చేసింది. భావనే ఎంఎస్ రాజు కొడుకు సినిమా చేస్తుందా లేక వేరే సినిమాలో నటిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. మలయాళీ అయిన భావన ఇపుడు తమిళంలో బిజీగా నటిగా కొనసాగుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X