'భీమిలి కబడ్డీ జట్టు' ఆ సమస్యలు దాటుతుందా?
తమిళంలో విజయవంతమైన వెన్నెల కబడ్డి కూటం చిత్రాన్ని మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ వారు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. 'భీమిలి కబడ్డీ జట్టు' టైటిల్ తో రెడీ అవుతున్న ఈ చిత్రం ద్వారా తాతినేని సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.అయితే తమిళంలో ఈ చిత్రానికి క్రేజ్ రావటానికి కబడ్డి ఆట ఒకటే కారణం కాకుండా అక్కడి నేటివిటీని దర్శకుడు పట్టుకుని తెరకెక్కించిన తీరు అందరి ప్రశంసలు పొందింది. అందులోనూ అక్కడ నెగిటివ్ ఎండింగ్ అక్కడ వారికి అలవాటే. అయితే ఎక్కువ ఆశావాదులైన తెలుగువారికి తగినట్లు క్లైమాక్స్ మార్చాలా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అలాగే మన నేటివిటీని దర్శకుడు ఎంతవరకూ ఎడాప్ట్ చేసి ఆ సినిమాని అనువదించాడన్నది మరో ప్రశ్న. ఎందుకంటే తమిళంలో సూపర్ హిట్ అయిన నాడోడిగల్ చిత్రాన్ని అదే దర్శకుడు సముధ్రఖని రవితేజ లాంటి స్టార్స్ తో శంభో శివ శంబో అంటూ రీమేక్ చేసినా ఆశించిన స్ధాయిలో వర్కవుట్ కాలేదు. ఇక 'భీమిలి కబడ్డీ జట్టు'లో నాని, శరణ్య మెహన్ జంటగా నటించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 16న పాటల్ని విడుదల చేస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించి ఈ సినిమా ఒరిజనల్ స్ధాయిలో ఆడాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











